Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి కప్పులో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్‌లో కింగ్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. అయితే అతడి వైఫల్యం మంచిదే అంటున్నాడు భారత బ్యాటింగ్ కోచ్.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి కప్పులో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్‌లో కింగ్ తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు. అయితే అతడి వైఫల్యం మంచిదే అంటున్నాడు భారత బ్యాటింగ్ కోచ్.
Nidhan
విరాట్ కోహ్లీ.. సాధారణ సిరీస్‌ల్లోనే చెలరేగి ఆడుతుంటాడు. అవతల ఉన్నది ఏ జట్టు అనేది పట్టించుకోకుండా బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తుంటాడు. క్రీజులో దిగిందే తడవు పరుగుల వర్షం కురిపిస్తాడు. గత దశాబ్దంన్నరగా అతడు ఇదే విధంగా ఆడుతూ ప్రస్తుత జనరేషన్లో టాప్ బ్యాటర్ రేంజ్‌కు చేరుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనే పరుగుల మోత మోగించే కింగ్.. ఇంక ఐసీసీ టోర్నమెంట్స్ అంటే చాలు తనలోని సిసలైన బ్యాటర్‌ను బయటకు తీసుకొస్తాడు. మెగా టోర్నీల్లో టీమిండియా గెలిచినా, ఓడినా కోహ్లీ మాత్రం బ్యాట్‌తో ఊచకోత కోస్తాడు. ఎన్నోమార్లు వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నీల్లో బెస్ట్ బ్యాటర్‌గా నిలిచాడు విరాట్. హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా నిలిచి అభిమానులను ఉర్రూతలూగించాడు. కానీ ప్రస్తుత టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం అతడి బ్యాట్ మ్యాజిక్ చేయడం లేదు.
పొట్టి కప్పులో కోహ్లీ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు విరాట్. యూఎస్ఏతో మ్యాచ్‌లోనైతే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడతను. అమెరికాలోని ట్రిక్కీ పిచ్‌లపై అనవసర హిట్టింగ్‌కు వెళ్తూ ఔట్ అవుతున్నాడు కింగ్. క్రీజులో కుదురుకోవడంపై ఫోకస్ చేయకుండా.. ఫస్ట్ బాల్ నుంచే భారీ షాట్లకు ప్రయత్నించి బౌలర్లకు దొరికిపోతున్నాడు. రెగ్యులర్‌గా ఆడే థర్డ్ డౌన్ కాకుండా ఓపెనర్‌గా రావడం కూడా అతడిపై ఒత్తిడి పెంచుతోంది. వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నంలో చెత్త షాట్లు ఆడి కోహ్లీ వెనుదిరుగుతున్నాడు. దీంతో అతడిపై విమర్శలు పెరుగుతున్నాయి. టాప్ స్కోరర్‌గా నిలుస్తాడనుకుంటే ఇలా జట్టుకు భారమవడం ఏంటని కొందరు మాజీ క్రికెటర్లు కూడా అతడిపై సీరియస్ అవుతున్నారు. ఈ విషయంపై తాజాగా భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రియాక్ట్ అయ్యాడు.
కోహ్లీ ఫెయిల్ అవడం టీమ్‌కు మంచిదేనని అన్నాడు విక్రమ్ రాథోడ్. విఫలమవడం వల్ల పరుగులు చేయాలనే కసి, తపన మరింత పెరుగుతాయని చెప్పాడు. విరాట్ ఇప్పుడు ఫుల్ ఆకలి మీద ఉన్నాడని తెలిపాడు. ‘కోహ్లీ ఇప్పుడు మరింత ఆకలితో ఉన్నాడు. ఎలాగైనా ఫామ్‌ను అందిపుచ్చుకోవాలని, పరుగులు చేయాలని అతడు పట్టుదలతో ఉన్నాడు. రాబోయే మ్యాచుల్లో టచ్‌లోకి రావాలని అతడు ప్రయత్నిస్తున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ నుంచి తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయనే నమ్మకం నాకు ఉంది. ఐపీఎల్లో అతడు ఎంత అద్భుతంగా ఆడాడో మనం చూశాం. మెగా టోర్నీ ఫస్టాఫ్‌లో ఫెయిలైనంత మాత్రాన ఏమీ మారదు. అతడు నెట్స్‌లో బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడు ఊపందుకోవడానికి ఒక్క మ్యాచ్ చాలు’ అని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. సూపర్-8 మ్యాచుల్లో పిచ్‌లు, పరిస్థితులకు తగ్గట్లు టీమ్ కాంబినేషన్‌ను ఎంచుకుంటామని పేర్కొన్నాడు. మరి.. కోహ్లీ ఫెయిలైనా మంచిదేనని, అంతే ధీటుగా బౌన్స్ బ్యాక్ అవుతాడంటూ బ్యాటింగ్ కోచ్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
India’s Batting coach said – “Actually, it’s good that Virat Kohli is more hungrier now. He is really keen to do well and really switched on. Looking forward to some good games & we’ve watched some good innings from him in this T20 World Cup 2024”. (Star Sports). pic.twitter.com/LiK0ZzbZ6f
— Tanuj Singh (@ImTanujSingh) June 17, 2024