సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే గ్రౌండ్ లో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొంత మంది ఆటగాళ్లు ఇతర ఆటగాళ్లపై కోప్పడుతుంటే.. మరికొంత మంది ఆటగాళ్లు గ్రౌండ్ లో చిందులు వేస్తూ.. ఆటను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో ముందుంటాడు టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. తాజాగా విండీస్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆటలో కోహ్లీ తనదైన శైలిలో డ్యాన్స్ ఇరగదీశాడు. అయితే సడన్ గా శవంలా పడుకుని అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు విరాట్ భాయ్. మరి విరాట్ అలా శవంలా ఎందుకు పడుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
విరాట్ కోహ్లీ.. బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తూ.. గ్రౌండ్ లో ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తనను కవ్వించిన బౌలర్లకు తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తాడు విరాట్. ఇక ఇంత అగ్రెసివ్ గా ఉండే విరాట్ లో మరో కోణం కూడా ఉంది. అదే హాస్య చతురత. మైదానంలో ఎంత కోపంగా ఉన్నా.. అప్పుడప్పుడు తనలో ఉన్న నటుడిని అభిమానులకు చూపిస్తుంటాడు. తాజాగా వెస్టిండీస్ తో జరిగిన తొలి టెస్ట్ లో తనలో ఉన్న డ్యాన్సర్ ను, నటుడిని మరోసారి చూపించాడు.
వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ లో మూడోరోజు ఆట జరుగుతున్న క్రమంలో కోహ్లీ గ్రౌండ్ లో చిందులు వేశాడు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా శవంలా పడుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు విరాట్. మళ్లీ సడన్ గా లేచి నవ్వులు చిందిస్తూ.. టీమిండియా ఆటగాళ్లవైపు చూశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కోహ్లీ ఎందుకు ఇలా చేశాడా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి ప్రత్యేకించి కారణం ఏదీ లేకపోగా.. అప్పుడప్పుడు విరాట్ భాయ్ సరదాగా ఇలా చేస్తుండటం మనం ఇదివరకే చాలా సార్లు చూశాం. అయితే ఇలా శవంలా పడుకోవడం ఇప్పటి వరకు చూల్లేదు.
Virat Kohli on the Field.pic.twitter.com/flkdbiiQEk
— CricketGully (@thecricketgully) July 15, 2023
ఇదికూడా చదవండి: సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటనకు షెడ్యూల్ ఖరారు