iDreamPost

RCBని వీడితేనే కోహ్లీ IPL కప్ కొడతాడు.. దానికి అతడు అర్హుడు: ఇంగ్లండ్ దిగ్గజం

ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపై ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీని వీడితేనే ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తాడని, అతడు ఆ టీమ్ లోకి వెళ్లాలని షాకింగ్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిపై ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీని వీడితేనే ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తాడని, అతడు ఆ టీమ్ లోకి వెళ్లాలని షాకింగ్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

RCBని వీడితేనే కోహ్లీ IPL కప్ కొడతాడు.. దానికి అతడు అర్హుడు: ఇంగ్లండ్ దిగ్గజం

టీమిండియా రన్ మెషిన్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా దుమ్మురేపాడు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతూ.. ఈ సీజన్ లో 741 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా రాజస్తాన్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమి చెందింది. ఇక ఈ ఓటమిపై ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీని వీడితేనే ఐపీఎల్ టైటిల్ సాధిస్తాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో పరుగుల వరదపారించినా.. ఆర్సీబీని గట్టెక్కించలేకపోయాడు. ఊహించని విధంగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఇక్కడి నుంచే నిష్క్రమించింది. ఇక బెంగళురు టీమ్ నాకౌట్స్ లో ఓడిపోవడంపై స్పందించాడు ఇంగ్లండ్ దిగ్గజ ప్లేయర్ కెవిన్ పీటర్సన్. “నేను గతంలో కూడా ఓసారి చెప్పాను.. మళ్లీ ఇప్పుడు చెబుతున్నాను. విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీకి అర్హుడు. కానీ అతడు ఆర్సీబీని వీడాలి. అప్పుడే తన కల నెరవేరుతుంది. చాలా మంది స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీలు మారి గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. ఈ సీజన్ లో కూడా అద్భుతంగా రాణించిన కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయినా టీమ్ ఫెయిల్ అయ్యింది. నేను మరోసారి చెబుతున్నా.. కోహ్లీ ఆర్సీబీని వదిలి హోమ్ టీమ్ ఢిల్లీలో చేరాలి” అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు పీటర్సన్.

ప్రస్తుతం కెపీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాగా.. ఇంగ్లండ్ దిగ్గజం చేసిన కామెంట్స్ ను కొందరు సమర్థిస్తున్నారు. గత 17 ఏళ్లుగా ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లీ, ఓసారి ఫ్రాంచైజీ మారితే బెటర్ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి పీటర్సన్ అన్నట్లుగా కోహ్లీ టీమ్ మారితే బెటరా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి