iDreamPost
android-app
ios-app

గ్రౌండ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన కోహ్లీ! వైరల్‌ వీడియో

  • Published Jul 15, 2023 | 9:48 AM Updated Updated Jul 15, 2023 | 10:06 AM
  • Published Jul 15, 2023 | 9:48 AMUpdated Jul 15, 2023 | 10:06 AM
గ్రౌండ్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన కోహ్లీ! వైరల్‌ వీడియో

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గ్రౌండ్‌లో ఫుల్‌ జోష్‌ అండ్‌ ఎనర్జీతో ఉంటాడనే విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో బాగా ఆడినా ఆడకపోయినా.. ఫీల్డింగ్‌ సమయంలో తన హండ్రెడ్‌పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెడుతూ.. ఇతర సభ్యులను ఉత్సాహ పరుస్తుంటాడు. వికెట్‌ పడితే బౌలర్‌ కంటే కూడా ఎక్కువ సెలబ్రేట్‌ చేసుకుంటూ అందరిలో గెలవాలనే కసిని నింపుతాడు. కొన్నిసార్లు ఓవర్ల మధ్యలో స్టేడియంలో ప్లే అయ్యే పాటలకు స్టెప్పులు సైతం వేస్తూ సరదా సరదాగా ఉంటాడు. తాజాగా వెస్టిండీస్‌తో తొలి టెస్టులోనూ కోహ్లీ తన క్లాసిక్‌ స్టెప్పులతో అదరగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 76 పరుగులతో రాణించాడు. రెండో రోజు 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ.. మూడో రోజు మరో 40 పరుగులు జోడించి అవుట్‌ అయ్యాడు. అయితే క్రికెట్‌ అభిమానులు మాత్రం కోహ్లీ సెంచరీ సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. కానీ, వెస్టిండీస్‌ బాహుబలి కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. కోహ్లీ అవుటైన కొద్ది సేపటికే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి.. వెస్టిండీస్‌ను రెండో ఇన్నింగ్స్‌కు ఆహ్వానించాడు. కానీ, అశ్విన్‌ స్పిన్‌ మాయాజాలం ముందు విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ నిలువలేకపోయింది. కేవలం 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాటర్‌ కూడా 30 పరుగుల మార్క్‌ను దాటలేదు. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అలిక్ అథనాజ్, రెండో ఇన్నింగ్స్‌లోనూ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అలిక్‌కు ఇదే తొలి టెస్టు కావడం విశేషం. తొలి టెస్టులోనే భారత స్పిన్‌ ఎటాక్‌ను కాస్తోకూస్తో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల తీసుకున్న అశ్విన్‌, రెండో ఇన్నింగ్స్‌లో మరింత చెలరేగి 7 వికెట్లతో సత్తా చాటాడు. 171 పరుగులతో అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టిన యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక 76 పరుగులతో పర్వాలేదనిపించిన కోహ్లీ, సెంచరీ మిస్‌ చేసినా డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చాడు. మరి కోహ్లీ డ్యాన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సౌతాఫ్రికాలో టీమిండియా పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు