iDreamPost
android-app
ios-app

విరుష్క అభిమానులకు గుడ్‌న్యూస్‌! ఆ రోజే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌?

  • Published Sep 30, 2023 | 2:12 PM Updated Updated Sep 30, 2023 | 2:33 PM
  • Published Sep 30, 2023 | 2:12 PMUpdated Sep 30, 2023 | 2:33 PM
విరుష్క అభిమానులకు గుడ్‌న్యూస్‌! ఆ రోజే బిగ్‌ అనౌన్స్‌మెంట్‌?

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలోనే వారి అభిమానులతో గుడ్‌న్యూస్‌ను పంచుకోనున్నారు. విరుష్క జంటగా పేరుపొందిన ఈ సార్ట్‌ కపుల్‌కు ఇప్పటికే వామిక అనే చిన్నారి కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. వీరికి త్వరలోనే రెండో సంతానం కూడా కలగనుంది. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఏ విషయాన్ని అయినా చాలా సీక్రెట్‌గా ఉంటే.. కోహ్లీ, అనుష్కలు ఈ విషయాన్ని సైతం అంత ఈజీగా బయటపడనివ్వడం లేదు. ఒక మంచి రోజు చూసుకుని.. ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడిస్తారని సమాచారం.

నవంబర్‌ 5న విరాట్‌ కోహ్లీనే పుట్టిన రోజు సందర్భంగా.. గుడ్‌న్యూస్‌ను అభిమానులతో పంచుకుంటారని వారి సన్నిహితులు తెలుపుతున్నారు. కాగా.. ఇప్పటి వరకు వామికా ఫొటోలను కూడా విరుష్క జంట బయటపెట్టలేదు. కొన్ని ఫొటోలు వచ్చినా.. అవి మీడియా దొంగచాటుగా తీసిన ఫొటోలో, లేక ఎయిర్‌ పోర్టుల్లో తీసిన ఫొటోలు మాత్రమే. కోహ్లీ, అనుష్కలు తమ తమ రంగాల్లో టాప్‌ పొజిషన్స్‌లో ఉన్న టైమ్‌లో.. ఓ యాడ్‌ షూట్‌లో వీళ్లిద్దరూ తొలి సారి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి స్నేహం కాస్త ప్రేమగా మారింది.

వారి ప్రేమ గురించి వార్తలు చక్కర్లు కొట్టినా.. ఏనాడు కూడా దానిపై స్పందించలేదు వారిద్దరూ. డైరెక్ట్‌గా 2017లో కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకున్నారు. 2021లో ఈ జంటకు వామిక జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సంతానం కలగనున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ వన్డే వరల్డ్‌ కప్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన కోహ్లీ.. మరోసారి అలాంటి మధురస్మృతులను పొందాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి విరుష్క జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియాకు రెండు మెడల్స్‌ అందించిన తెలంగాణ బిడ్డ ఇషా

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026