iDreamPost
android-app
ios-app

Virat Kohli, Rohit Sharma: ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మనే!

  • Published Dec 10, 2023 | 5:56 PMUpdated Dec 10, 2023 | 5:56 PM

క్రికెట్‌లో తిరుగులేని స్టార్లుగా ఉన్న విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు ఇప్పుడు.. ఓ రికార్డు విషయంలో కూడా దూసుకెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత వాళ్లిద్దరే ముందున్నారు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. క్రికెట్‌లో ఎలాంటి ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల ఆటకు ప్రపంచ మొత్తం ఫిదా అయిపోయింది. ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు బద్దులుకొడుతూ.. మోడ్రన్‌ గ్రేట్స్‌గా దూసుకెళ్తున్నారు. అయితే.. క్రికెట్‌లోనే కాదు సోషల్‌ మీడియా రికార్డ్స్‌లో కూడా ఈ ఇద్దరు ముందున్నారు. తాజాగా నవంబర్‌ నెలలో ఎక్కువ మంది సెర్చ్‌ చేసినా లేదా ట్యాగ్‌ చేసిన ట్విట్టర్‌ అకౌంట్స్‌లో విరాట్‌ కోహ్లీ రెండో స్థానంలో, రోహిత్‌ శర్మ మూడో స్థానంలో నిలిచారు.

ఇక ఈ లిస్ట్‌లో మొదటి స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయన తర్వాత విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఉన్నారు. ఇద్దరు స్టార్‌ క్రికెటర్లు ఇలా సోషల్‌ మీడియా రికార్డ్స్‌లోనూ పోటీ పడుతుండటంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నాయి. కాగా, విరాట్‌ కోహ్లీకి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ఏకంగా 264 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంత భారీ ఫాలోయింగ్‌ ఉన్న సెలబ్రెటీలు ఇండియాలో చాలా తక్కువ మందే ఉన్నారు.

చాలా మంది కోహ్లీకి దగ్గర్లో కూడా లేరు. కాగా.. ఈ లిస్ట్‌లో టాప్‌లో ఇద్దరు క్రికెటర్ల మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లు సినిమా యాక్టర్లు, రాజకీయ నేతలు ఉన్నారు. మొదటి స్థానంలో మోదీ, రెండు, మూడు ప్లేసుల్లో కోహ్లీ, రోహిత్‌ శర్మ. నాలుగో స్థానంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, ఐదో ప్లేస్‌లో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, 6వ స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, 7వ ప్లేస్‌లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఉన్నారు. 8వ ప్లేస్‌లో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తలపతి, 9వ ప్లేస్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, 10వ స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నారు. మరి ఈ లిస్ట్‌లో కోహ్లీ, రోహిత్‌ టాప్‌ 3లో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి