SNP
ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ అవుటైన విధానంలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా వరల్డ్ కప్‌లో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ అవుటైన విధానంలో ఓ ఆసక్తికర విషయం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బ్రేకుల్లేని బుల్లెట్ బండిలా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ లాంటి పెద్ద టీమ్స్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఆదివారం మరో పెద్ద టీమ్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. ఆ జట్టు గట్టి ప్రత్యర్థే. అందుకే నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో కాస్త ఇబ్బంది పడింది. కానీ, బౌలింగ్ బలంతో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించి, వరుసగా ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో టీమిండియా దాదాపు సెమీస్‌కు చేరినట్లే. అయితే.. మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క సౌతాఫ్రికానే గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇక శ్రీలంక, నెదర్లాండ్స్ జట్టు మన టీమ్ ముందు పెద్దగా నిలబడకపోవచ్చు. అయితే.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎవరూ గమనించని ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. పిచ్ కండీషన్స్‌ను చూసి.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బట్లర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ.. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చూస్తే.. టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. కేవలం 40 పరుగులకే టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడి నుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ టీమిండియాను ఆదుకున్నారు. ఆ తర్వాత ఎక్కడైతే వికెట్ పడకూడదో.. అలాంటి చోటే భారత్ వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సరిగ్గా స్కోర్ బోర్డును పరిగెత్తించే టైమ్‌లో అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా రావాల్సిన, కావాల్సిన స్కోర్ కంటే చాలా తక్కువ వచ్చింది. 229 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియాకు విజయం కష్టమేనేమో అని చాలా మంది క్రికెట్ అభిమానులు భావించారు.
అయితే.. టీమిండియా బ్యాటింగ్‌లో ఇంత కొల్యాప్స్‌కి కారణం.. ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అవుటైన విధానం గురించి మాట్లాడుకుంటే.. కోహ్లీ 9 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా డక్ అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లు లూజ్ బంతులు వేయకుండా, కోహ్లీ కొట్టిన వాటికి ఫీల్డర్లు పరుగులు ఇవ్వకుండా అతని చేతులు కట్టేశారు. ఎక్కువ డాట్స్ బాల్స్ ఆడించి కోహ్లీపై ఒత్తిడి పెంచి, అతను పెద్ద షాట్ ఆడేలా చేసింది ఇంగ్లండ్ టీమ్. అది సరిగ్గా వర్క్‌అవుట్ అవ్వడంతో.. విల్లే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ బంతిని గాల్లోకి ఆడేసి బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఎక్కువగా డాట్ బాల్స్ ఆడటంతోనే కోహ్లీపై ఒత్తిడి పెరిగి వికెట్ సమర్పించుకున్నాడు. సరిగ్గా ఇదే స్ట్రాటజీని, స్కెచ్‌ను.. ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ స్టోక్స్‌కు కూడా ఉపయోగించింది టీమిండియా.
స్టోక్స్ బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత.. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేసి అతనికి రన్స్ ఇవ్వలేదు. ఫీల్డింగ్ కూడా సూపర్‌గా చేసి.. స్టోక్స్‌పై ప్రెజర్ పెంచారు. సాధారణంగానే వేగంగా ఆడే స్టోక్స్ 9 బంతులను డాట్ చేయడంతో ఓపిక నశించి.. షమీ బౌలింగ్‌లో అర్థంలేని భారీ షాట్ ఆడబోయి.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటి వరకు వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ డెలవరీలు వేసిన షమీ.. ఇన్నింగ్స్ 8వ చివరి బంతిని వైడ్ ఆఫ్ ఆఫ్ స్టంప్ బయట పిచ్ చేసి.. లోపకి కట్ చేశాడు. ఈ డెలవరీ ఏ మాత్రం అంచనా వేయలేకపోయినా స్టోక్స్ వికెట్ సమర్పించుకున్నాడు. కోహ్లీ విషయంలో ఏ డాట్ బాల్స్ స్కెట్‌నైతే ఇంగ్లండ్ వాడిందో.. అదే స్కెచ్‌తో షమీ బెన్ స్టోక్స్‌ను అవుట్ చేశాడు. మరి స్టోక్స్‌ను షమీ అవుట్ చేసిన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Mohammed Shami Vs Ben Stokes was a one sided battle. pic.twitter.com/U7iSnIk1zS
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 29, 2023
STOKES V SHAMI 🔥 This over will give nightmare to Ben stokes and England for many years. Legend Shami 💪#MohammadShami #ICCWorldCup2023 #INDvsENG #BCCI pic.twitter.com/GlmawY4xZD
— Pull-Shot™ (@cricket_st92798) October 29, 2023