iDreamPost
android-app
ios-app

పెళ్లి విందులో మహిళలకు మద్యం.. వీడియో వైరల్

  • Published Feb 22, 2024 | 11:14 AM Updated Updated Feb 22, 2024 | 11:14 AM

ఎక్కడైనా సరే పెళ్ళికి వెళ్లిన అతిధులకు విందులో అనేక రకాల రుచికరమైన ఆహార పదార్ధాలను వడ్డించడం సహజం. కానీ, ఇక్కడ పెళ్ళికి విచ్చేసిన వారికీ మాత్రం ఏకంగా విందులో మద్యాన్ని కూడా అందిస్తున్నారు. వారిలో మహిళలే ఎక్కువ కనిపిస్తుండడంతో ఈ వీడియో అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

ఎక్కడైనా సరే పెళ్ళికి వెళ్లిన అతిధులకు విందులో అనేక రకాల రుచికరమైన ఆహార పదార్ధాలను వడ్డించడం సహజం. కానీ, ఇక్కడ పెళ్ళికి విచ్చేసిన వారికీ మాత్రం ఏకంగా విందులో మద్యాన్ని కూడా అందిస్తున్నారు. వారిలో మహిళలే ఎక్కువ కనిపిస్తుండడంతో ఈ వీడియో అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

  • Published Feb 22, 2024 | 11:14 AMUpdated Feb 22, 2024 | 11:14 AM
పెళ్లి విందులో మహిళలకు మద్యం.. వీడియో వైరల్

సాధారణంగా ఏ పెళ్ళిలో అయినా వినోదాలతో పాటు విందులు కూడా ఘనంగానే ఉంటాయి. కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు పెళ్లిళ్లలో కూడా కొత్త సంప్రదాయాలు మొదలయ్యాయి. ఇంటి ముందు వేసే పందిరి దగ్గర నుంచి .. భోజనం మీద వడ్డించే పదార్ధాల వరకు ఎవరికీ వారు.. ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉండాలని ..ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో ఏ పెళ్లిళ్లు చూసినా .. వెళ్లే అతిధులను ఆ ఇంటివారు ఆశ్చర్య పరుస్తూనే ఉన్నారు. అయితే ఎక్కడైనా సరే, భోజనానికి ముందు స్నాక్స్ , కూల్ డ్రింక్స్ లాంటివి ఇస్తూ ఉండడం చూసే ఉంటాము. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్న.. ఓ ఇంటి వేడుకకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం అందరు ఆశ్చర్య పోవాల్సిందే. ముఖ్యంగా మగవారికి ఈ వీడియో చూసిన తర్వాత అసూయా కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంటి వేడుకకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సాధారణంగా విందు భోజనాలలో కూర్చున్నట్టే ఆ వీడియోలో కనిపిస్తున్న మహిళలు కూడా .. క్యూ లో కూర్చుని భోజనం చేస్తున్నారు. సహజంగా బంతి భోజనాలలో స్వీటు , హాట్ తో పాటు మిగిలిన అన్ని పదార్ధాలను .. ఆకులో వడ్డించుకుంటూ వెళ్తుంటారు. కానీ, ఈ వీడియోలో కనిపిస్తున్న ఫంక్షన్ లో మాత్రం వాటర్ గ్లాసెస్ లో వాటర్ పోసినట్టు .. మద్యాన్ని కూడా అతిధులకు అందిస్తున్నారు. అది కూడా అక్కడ అంతా ఆడవారే ఉండడం .. సప్లై చేసేవారు కూడా ఆడవారే ఉండడంతో.. ఈ వీడియో అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ, అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ సంఘటన ఎక్కడ జరిగింది .. ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు.

ఈ వీడియోను @HasnaZaruriHai అనే యూజర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో.. ఇది వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ ఒకరు, ఇక్కడ మహిళలకు అందిస్తున్నట్లుగా వారి స్థానంలో మగవారికి మద్యం ఎక్కడా అందించారంటూ . మరొకరు ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు మహిళలు అన్నిటిలోను మగవారితో పోటీ పడుతున్నారనిపిస్తోంది. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibommarsbahis girişMarsbahisjojobetjojobet girişJojobet Giriş