iDreamPost

విక్రాంత్ మాస్సే పాత ట్వీట్ తెచ్చిన తంటా

  • Published Feb 22, 2024 | 7:31 PMUpdated Feb 22, 2024 | 7:31 PM

Vikrant Massey: ఇటీవల '12th ఫెయిల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే అనుకోకుండా ఒక వివాదంలో ఇరుక్కున్నారు.

Vikrant Massey: ఇటీవల '12th ఫెయిల్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే అనుకోకుండా ఒక వివాదంలో ఇరుక్కున్నారు.

  • Published Feb 22, 2024 | 7:31 PMUpdated Feb 22, 2024 | 7:31 PM
విక్రాంత్ మాస్సే పాత ట్వీట్ తెచ్చిన తంటా

ఇటీవల ’12th ఫెయిల్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే అనుకోకుండా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఒక ఇంటర్వ్యూ లోని స్టేట్మెంట్ తో పాటు తన పాత ట్వీట్ కూడా ఇందుకు కారణం అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ విశేషాలను పంచుకున్నారు విక్రాంత్ మాస్సే. ఆయన కుటుంబంలో తల్లి సిక్కు, క్రైస్తవ తండ్రి, ఇస్లాం మతంలోకి మారిన సోదరుడు ఉన్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక తనతో పాటు తన భార్య హిందూలమని ఆయన చెప్పారు.

మతం అనేది మనుషులే నిర్మించుకున్న విషయం అని మాస్సే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత పై చర్చలతో నిండిన తన పెంపకం వల్ల తనకు ఈ అభిప్రాయం వచ్చిందన్నారు. ఈ ఇంటర్వ్యూ తరువాత, హిందూ మత సమర్ధకులు విక్రాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018 లో మాస్సే పోస్ట్ చేసిన పాత ట్వీట్ లని తవ్వారు. ఒక ట్వీట్ లో సీతాదేవి రాముడితో “నన్ను మీ భక్తులు కాకుండా రావణుడు కిడ్నాప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది,” అని చెప్పిన ఎడిటోరియల్ కార్టూన్ ను విక్రాంత్ పంచుకున్నారు. జమ్ము కశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం, హత్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన గతంలో ఈ ట్వీట్ చేశారు.

అయితే తన ట్వీట్ వల్ల కాంట్రవర్సి అవడంతో విక్రాంత్ మాస్సే స్పందించారు. హిందూ సమాజాన్ని అగౌరవపరిచే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేస్తూ చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పారు. ఎప్పుడో చేసిన పాత ట్వీట్ కు ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సి రావటం ఏమిటని విక్రాంత్ అభిమానులు భాద పడ్డారు. 2007లో చిన్న చిన్న టీవీ పాత్రలతో నటుడిగా విక్రాంత్ ప్రయాణం ప్రారంభమైంది. 2013లో వచ్చిన ‘లూటేరా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి ‘ఛపాక్’, ‘మీర్జాపూర్’ వంటి పలు ప్రాజెక్టుల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నా, కెరీర్ లో పెద్ద బ్రేక్ రాలేదు. 2023లో ’12th ఫెయిల్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. కొందరికి తన వ్యక్తిగత అభిప్రాయాలు నచ్చకపోతే వాటిని సాకుగా చూపించి విక్రాంత్ కెరీర్ ను చెడగొట్టే ప్రయత్నం చేయడం చాలా తప్పని ఆయనకు మద్దతుగా ఉన్న సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు అంటున్నారు.

ఇదికూడా చదవండి: ఏషియన్ ఫిలిమ్స్ మాస్టర్ ప్లాన్! హీరోలతో బిజినెస్ ఎలా చేస్తున్నారు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి