iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‘విక్రమ్‌’ సౌండ్‌ బ్యూటీ!

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‘విక్రమ్‌’ సౌండ్‌ బ్యూటీ!

లోకనాయకుడు కమల్‌ హాసన్- హిట్టు సినిమాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ విక్రమ్‌’ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సూపర్‌ హిట్‌ అయింది. దేశ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక, ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న పాత్రధారులకు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి వారిలో చిన్న కెమియో పాత్రలో నటించిన ‘మాయా కృష్ణన్‌’ ఒకరు.

ఈమె ఈ సినిమాలో వేశ్యగా నటించారు. కమల్‌ హాసన్‌ ఈమె దగ్గరి వెళ్లే సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. మాయా కృష్ణన్‌ తాజాగా ‘బిగ్‌ బాస్‌’లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, అది తెలుగు బిగ్‌ బాస్‌ కాదు. తమిళ బిగ్‌ బాస్‌. ఈ షోకు కమల్‌ హాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా, తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ప్రారంభమైంది. మాయా కృష్ణన్‌ ఈ షోలో 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. మాయాను చూడగానే కమల్‌ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేమగా ఆమెను హత్తుకున్నారు.

ఇక, మాయ వివరాల్లోకి వెళితే.. ఆమెది మధురై. సినిమాల మీద ఆసక్తితో చిన్నప్పుడే చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డారు. చిన్న చిన్న పాత్రలు ఎన్నో చేశారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. విక్రమ్‌ సినిమాతో ఊహించిన దానికంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ క్రేజ్‌తోనే ప్రస్తుతం బిగ్‌ బాస్‌ 7లోకి అడుగుపెట్టారు. మరి, మాయా కృష్ణన్‌ బిగ్‌ బాస్‌ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetcasibom girişHoliganbet GirişOnwin GirişBahsegel girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/pokerklascasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelMarsbahis Güncel GirişHoliganbet GirişHoliganbet Güncel Giriş