iDreamPost
android-app
ios-app

ధృవ్‌ నక్షత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మేకర్స్‌! ఎప్పుడంటే..?

  • Published Mar 16, 2024 | 1:03 PM Updated Updated Mar 16, 2024 | 1:03 PM

Vikram: ఎన్నో ఏళ్లుగా వాయిదాలు పడుతూ అడుగడుగున సమస్యలు ఎదుర్కొంటూన్న విక్రమ్ లెటెస్ట్ మూవీ ఎట్టాకేలకు థియేటర్లలో విడుదల కానుంది.

Vikram: ఎన్నో ఏళ్లుగా వాయిదాలు పడుతూ అడుగడుగున సమస్యలు ఎదుర్కొంటూన్న విక్రమ్ లెటెస్ట్ మూవీ ఎట్టాకేలకు థియేటర్లలో విడుదల కానుంది.

  • Published Mar 16, 2024 | 1:03 PMUpdated Mar 16, 2024 | 1:03 PM
ధృవ్‌ నక్షత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటించిన మేకర్స్‌! ఎప్పుడంటే..?

కోలీవుడ్‌ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్‌.. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా మంచి సక్సెస్ అందుకున్న విక్రమ్ తన తదుపరి ప్రాజక్ట్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే.. ఆయన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందిస్తున్న ‘ధృవ నక్షత్రం’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనేది గౌతమ్ మీనన్ 2013లో ప్రారంభించారు. కానీ, అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్న ఈ సినిమా 2016లో పట్టాలెక్కించగా.. దీనిని 2017లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే, అప్పటికి ఆ సినిమా చిత్రీకరణ పూర్తైయిన్నపటికి అనుకొని కారణాలతో ఈ చిత్రం వాయిదా పడింది. ఇక ఆ తర్వాత మళ్లీ గతేడాది నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారకంగా ప్రకటించగా.. అది కూడా విఫలమైంది.ఇక ఏడాదిన్నరగా ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు తాజాగా రిలీజ్ డేట్ ను మరోసారి ప్రకటించరు మూవీ మేకర్స్. ఇంతకి ఎప్పుడంటే..

దశాబ్దలుగా గౌతమ్ మీనన్ కలగంటూన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఎట్టకేలకు తెరకెక్కనుంది. కాగా. ‘ధృవ నక్షత్రం’ సినిమాను మొదటగా దర్శకుడు గౌతమ్ మీనన్ 2013లో హీరో సూర్యతో మొదలు పెట్టారు. కానీ, సూర్య ఈ ప్రాజెక్ట్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఇక ఆ స్థానంలో 2015లో జయం రవి ని తీసుకుని కొంతమేర షూట్ కూడా చేశారు. అయితే జయం రవి కూడా మధ్యలోనే డ్రాప్ అయిపోవడంతో.. ఈ సినిమాను విక్రమ్ తో మళ్లీ మొదలు పెట్టారు. కానీ, హీరోలా విషయంలో ఎలా జరిగిందో అచ్చం అదే విధంగా హీరోయిన్ విషయంలోనూ జరిగింది. ఈ క్రమంలోనే.. త్రిష, నయనతార, సమీరారెడ్డి, అసిన్ , అను ఇమ్మాన్యుయేల్ , అమలా పాల్ వంటి తదితర హీరోయిన్ లను కథానాయికులుగా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి వెళ్లిపోయారు. ఇక చివరకు ధృవ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మను ఎంపిక చేశారు. అలా హీరో, హీరోయిన్లు మారినప్పుడల్లా ఈ సినిమా రీ షూట్లు చేస్తూ వచ్చారు.

vikram movie release date fix

అయితే ఎట్టకేలకు ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. కాగా, ఈ సినిమాను ఈనెల అనగా మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అసలే విక్రమ్ నటిస్తున్న సినిమా కాబట్టి, ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఇంత బ్రేక్ రావడం పై ఒక రకంగా గౌతమ్ మీనన్ కూడా కారణం అంటున్నారు. ఎందుకంటే.. ఆయనే ఈ సినిమాకు నిర్మాత కావడంతో.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బులు కూడినప్పుడల్లా ఈ సినిమా షూటూ చేసుకుంటూ వచ్చారట. మరి, ఎట్టాకేలకు థియేటర్లలో విక్రమ్,ధృవ నక్షత్రం సినిమా విడుదల కాబోతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobetjojobet girişjojobet girişjojobetjojobet girişjojobetjojobet girişjojobetjojobet giriş