iDreamPost

Vikram : కమల్ సినిమాకు మతిపోయే ఆఫర్

Vikram : కమల్ సినిమాకు మతిపోయే ఆఫర్

ఒకప్పుడు షూటింగ్ స్టేజిలో ఉన్న సినిమాలకు కేవలం శాటిలైట్ హక్కులు మాత్రమే అదనపు ఆదాయ వనరుగా ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఓటిటిలో వచ్చాక విపరీతమైన పోటీ ఏర్పడి నిర్మాతలకు కోట్ల రూపాయల కనక వర్షం కురుస్తోంది. దాదాపు ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ మొత్తాన్ని వీళ్ళే సమకూర్చి ప్రొడ్యూసర్ కు టెన్షన్ లేకుండా చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్న విక్రమ్ ఆల్ ఇండియా ఆఫ్టర్ థియేటర్ శాటిలైట్ అండ్ ఓటిటి రైట్స్ ని డిస్నీ హాట్ స్టార్ సంస్థ వంద కోట్ల దాకా ఆఫర్ చేసి సొంతం చేసుకున్నట్టు వచ్చిన వార్త చెన్నై మీడియాలోనే కాదు ఇతర వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఇది చాలా భారీ మొత్తం. ఇంత క్రేజ్ రావడానికి కారణం లేకపోలేదు. ఇందులో లోకనాయకుడుతో పాటు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం చివరి స్టేజిలో ఉంది. ఏప్రిల్ 29 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు కానీ ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. గత కొన్నేళ్లుగా కమల్ కు తన స్థాయి హిట్టు లేదు. అయినా కూడా ఇంత పెద్ద ఆఫర్ రావడం అంటే మాటలు కాదు. విజయ్ మాస్టర్ తో తన రేంజ్ పెంచుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ దీన్ని కూడా అభిమానులు మెచ్చే రీతిలో డిఫరెంట్ గా ప్లాన్ చేశారట.

ఈ లెక్కన చూస్తే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి గ్రాండియర్స్ కు డిజిటల్ రైట్స్ రూపంలో రెండు వందల కోట్ల దాకా రావడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. పైన చెప్పిన విక్రమ్ ప్యాకేజీలో శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయట. హిందీ వెర్షన్ ని మాత్రం గోల్డ్ మైన్స్ కి ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఎలా చూసుకున్న రాబోయే భవిషత్తులో ఓటిటిలు ఎలాంటి డెసిషన్ మేకర్లు కాబోతున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే నిర్మాతలు ధైర్యంగా ఓవర్ ది బడ్జెట్ వెళ్ళడానికి సాహసం చేస్తారు. ఒకవేళ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా ఇబ్బంది ఉండదు. విక్రమ్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించడం ప్రధాన ఆకర్షణ

Also Read : Saagar K Chandra : సూపర్ హిట్ తర్వాత ఏ హీరోతో చేస్తారో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి