iDreamPost

Vijay Thalapathy GOAT OTT: రికార్డు బ్రేక్ ధరకు విజయ్ గోట్ మూవీ OTT రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published May 22, 2024 | 5:49 PMUpdated May 22, 2024 | 5:49 PM

ఓటీటీ లకు బాగా క్రేజ్ పెరిగిపోవడంతో సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకాముందే..డిజిటల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడు పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మరొక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి బజ్ నడుస్తుంది, దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఓటీటీ లకు బాగా క్రేజ్ పెరిగిపోవడంతో సినిమాలు ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకాముందే..డిజిటల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడు పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మరొక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి బజ్ నడుస్తుంది, దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published May 22, 2024 | 5:49 PMUpdated May 22, 2024 | 5:49 PM
Vijay Thalapathy GOAT OTT: రికార్డు బ్రేక్ ధరకు విజయ్ గోట్ మూవీ OTT రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేటర్ లో సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఆయా సినిమాలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ వెంటనే వచ్చేస్తున్నాయి, ఈ క్రమంలో ఇప్పుడు ఇంకాస్త ముందుగా.. థియేటర్ లో సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే భారీ ధరలకు స్ట్రీమింగ్ రైట్స్ అమ్ముడుపోవడం విశేషం. తాజాగా ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరలకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దళపతి నటిస్తున్న సినిమా కూడా ఈ లిస్ట్ లో యాడ్ అయిపోయింది. తాజాగా దళపతి విజయ్ నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైమ్. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.

తమిళ హీరో విజయ్ దళపతి గురించి తెలుగునాట ప్రత్యేకమైన పరిచయం అవసరం. తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన విజయ్. త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టె ముందు.. ఇప్పుడు నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ది టైం చిత్రం చివరి చిత్రం కావడంతో.. ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 5 న థియేటర్ లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పటికే శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమా భారీగా రికార్డులను బ్రేక్ చేసినసంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడు పోయాయని సమాచారం.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ.110 కోట్లకు కొనుగోలు చేసిందని సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ రూ.90 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఇక ఇప్పుడు ఈ సినిమాపై అందరికి ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ విషయానికొస్తే.. ఇదొక సైన్స్ ఫిక్షన్ జోనర్ లో వస్తున్న సినిమా.. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ తో పాటు విజయ్ తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, జయారం, యోగి బాబులాంటి ఎంతో మంది ఫేమస్ నటులు ప్రేక్షకులను అలరించబోతున్నారు. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి