iDreamPost
android-app
ios-app

Bhavadeeyudu Bhagat Singh : పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్ ?

  • Published Jan 19, 2022 | 7:54 AM Updated Updated Jan 19, 2022 | 7:54 AM
  • Published Jan 19, 2022 | 7:54 AMUpdated Jan 19, 2022 | 7:54 AM
Bhavadeeyudu Bhagat Singh : పవర్ స్టార్ కోసం పవర్ ఫుల్ విలన్ ?

గత ఏడాది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ఉప్పెనలో విలన్ రాయణంగా అద్భుతంగా మెప్పించిన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యాడు. అంతకు ముందు సైరాలో చేసినా రాని గుర్తింపుని ఇది పూర్తిగా ఇచ్చి పడేసింది. తమిళంలోనే విపరీతమైన బిజీగా ఉండటంతో ఇక్కడెన్ని ఆఫర్లు వచ్చినా కూడా మెల్లగా నో చెప్పుకుంటూ వచ్చారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న భవదీయుడు భగత్ సింగ్ లో కీలకమైన నెగటివ్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతినే సంప్రదించినట్టు తెలిసింది. పాత్ర నచ్చింది కానీ డేట్లు కనక సర్దుబాటు చేయగలిగితే ఒప్పుకునే ఛాన్స్ ఉందట

ఇదే జరిగితే తెరమీద క్లాష్ అఫ్ ది టైటాన్స్ రేంజ్ లో పవన్ విజయ్ ల యుద్ధాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లని భవదీయుడు భగత్ సింగ్ లో పవన్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. అందులో ఒకటి ఒరిజినల్ భగత్ సింగ్ పాత్రేనని అంటున్నారు. శ్యామ్ సింగ రాయ్ తరహాలో ఫ్లాష్ బ్యాక్ లో ఒకటి వర్తమానంలో ఒకటి ఇలా రెండు షేడ్స్ లో పవన్ ని నెవర్ బిఫోర్ తరహాలో ప్రెజెంట్ చేయొచ్చని అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందిస్తోంది. హీరోయిన్ గా పూజా హెగ్డే దాదాపుగా ఓకే అయినట్టే.

ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ బ్యాలన్స్ ని పూర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఫిబ్రవరి 25 విడుదల అయినా కాకపోయినా ఆలోగా ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉండటం చాలా అవసరం. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఎవరికి అనుకూలంగా ఉంటాయో అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంచి డేట్లు టాలీవుడ్ ప్రొడ్యూసర్లు మిస్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే జనవరిలో ఒక్క బంగార్రాజు మాత్రమే స్టార్ హీరో సినిమాగా మిగిలిపోయింది. వేసవిలో పోటీ చాలా విపరీతంగా ఉండబోతున్న తరుణంలో భీమ్లా నాయక్ త్వరగా వచ్చేస్తేనే బెటర్. ఇది పూర్తి చేశాక క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ స్పీడ్ ని పెంచాల్సి ఉంటుంది

Also Read : Sai Pallavi : మహేష్ బాబు కాంబో మిస్ అయినట్టేనా

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş