iDreamPost
android-app
ios-app

బలగం సీన్‌ రిపీట్‌.. హీరో భార్య సమాధి దగ్గరకు కాకులు!

బలగం సీన్‌ రిపీట్‌.. హీరో భార్య సమాధి దగ్గరకు కాకులు!

ప్రముఖ కన్నడ హీరో విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత ఆదివారం బ్యాంకాక్‌ టూరులో ఉన్న గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం బెంగళూరులోని మల్లేశ్వరంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. తాజాగా, స్పందన సమాధి దగ్గర జరగాల్సిన కొన్ని పూజల్ని కుటుంబసభ్యులు పూర్తి చేశారు. ఆమెకు ఇష్టం అయిన ఆహార పదార్థాల్ని సమాధి దగ్గర ఉంచారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

బలగం సినిమాలో చూపించే ‘పిట్ట ముట్టుడు’ కార్యక్రమం తరహా సంఘటన చోటు చేసుకుంది. హీరో భార్య కోసం పెట్టిన ఇష్టమైన ఆహారం తినడానికి కాకులు వచ్చాయి. సమాధిపై ఉంచిన వాటిని ఎంతో ఇష్టంగా తిన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, స్పందన భర్త, పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బాధాతప్త హృదయాలతోటే అంత్యక్రియల తర్వాత జరగవల్సిన కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.

ఈ నేపథ్యంలోనే విజయ్‌ రాఘవేంద్ర కుటుంబం శ్రీరంగ పట్టణం వెళ్లింది. దాదాపు 50 మంది కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లారు. శ్రీరంగ పట్టణంలోని కావేరి నదిలో స్పందన ఆస్తికలను కలపనున్నారు. కాగా, విజయ్‌ రాఘవేంద్ర కన్నడ నాట స్టార్‌ హీరోగా వెలుగొందుతున్నారు. దివంగత హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌కు విజయ్‌ రాఘవేంద్ర దగ్గరి చుట్టం. రాజ్‌కుమార్‌ ఫ్యామిలీనుంచి వచ్చినా.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో హిట్టు సినిమాలు చేశారు. మరి, విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన సమాధి వద్ద బలగం సీన్‌ రిపీట్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş