iDreamPost
android-app
ios-app

అర్జున్ రెడ్డి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ కి పండగే! కానీ అసలు ట్విస్టు అక్కడే!

  • Author ajaykrishna Updated - 03:42 PM, Fri - 1 September 23
  • Author ajaykrishna Updated - 03:42 PM, Fri - 1 September 23
అర్జున్ రెడ్డి కాంబో రిపీట్.. ఫ్యాన్స్ కి పండగే! కానీ అసలు ట్విస్టు అక్కడే!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఉండే క్రేజ్ వేరు. ఆ కాంబినేషన్ లో మొదటి సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిందంటే.. అదే కాంబోలో మరో సినిమా ఎన్నేళ్లకు వచ్చినా ఆ క్రేజ్ ఎక్కడికి పోదు. ఎందుకంటే.. ఫస్ట్ మూవీతోనే కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారంటే.. సెకండ్ మూవీ మినిమమ్ గ్యారంటీ అని అంచనాలు పెంచేసుకుంటారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో అలాంటి క్రేజీ కాంబినేషన్ ఏదైనా ఉందంటే.. అది విజయ్ దేవరకొండ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో. వీరి కాంబినేషన్ లో 2017లో అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యింది. ఎన్నో కాంట్రవర్సీలకు దారి తీసిన ఆ సినిమా.. ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇండస్ట్రీలోని పాథ్ బ్రేకింగ్ మూవీస్ లో అర్జున్ రెడ్డి ఒకటి. అలాంటి మూవీ ఒక్కసారిగా విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ లను స్టార్స్ ని చేసేసింది. పబ్లిసిటీ దగ్గరనుండి ప్రమోషన్స్ వరకు అన్నివిధాలా సినిమా కాంట్రవర్సీలతో ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమా ప్రభావం అటు యూత్ పై.. యంగ్ డైరెక్టర్స్ పై నెక్స్ట్ లెవెల్ లో కనిపించింది. కట్ చేస్తే.. సందీప్ దర్శకుడిగా ఇదే అర్జున్ రెడ్డిని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రూపొందించి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. ఇంకేముంది.. వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో పాటు పాన్ ఇండియా హీరోలతో సినిమాలు క్యూ కట్టేశాయి. ఓవైపు రణబీర్ కపూర్ తో యానిమల్ చేస్తూ.. మరోవైపు ప్రభాస్ తో స్పిరిట్ లైనప్ చేసేశాడు సందీప్.

యానిమల్ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కాబో్తుండగా.. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇంకా లైన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సందీప్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో మరో సినిమా అంటూ హైప్ క్రియేట్ అయిపోయింది. అందుకు కారణం.. ఖుషి ప్రొడ్యూసర్ రవి. ఆయనే సందీప్ – విజయ్ కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు. దీంతో అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ లో మళ్లీ ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. కానీ.. ఈ కాంబినేషన్ లో మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే.. ప్రస్తుతం యానిమల్, స్పిరిట్ లతో పాటు ఆ తర్వాత మహేష్, బన్నీలతో సందీప్ ప్లాన్స్ జరుగుతున్నాయట. యానిమల్ తర్వాత స్పిరిట్ కి చాలా టైమ్ పడుతుంది. ఆ లెక్కన.. విజయ్ తో మూవీ ఎప్పుడు ఉంటుందో చెప్పలేం. మరి అర్జున్ రెడ్డి కాంబోలో మరో సినిమా వస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibom