iDreamPost

విజయ్ దేవరకొండ నిర్ణయం సరైనదేనా?

విజయ్ దేవరకొండ నిర్ణయం సరైనదేనా?

నిన్న జరిగిన వరల్డ్ ఫేమస్ లవర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ ఇకపై ప్రేమ కథలు చేయనని ఇదే చివరిదని ప్రకటించడం అందరిని షాక్ కు గురి చేసింది. మీడియా సైతం ఇది ఊహించలేదు. ఇంకా పట్టుమని పది సినిమాలు కూడా కాలేదు. అప్పుడే లవ్ స్టోరీస్ అంటే ఇంత వైరాగ్యం ఎందుకొచ్చిందానే చర్చ జోరుగా సాగింది. వరల్డ్ ఫేమస్ లవర్ మీద నిజంగా గట్టి నమ్మకం ఉంటే ఈ మాట అనేవాడు కాదు. ఎందుకంటే హిట్ అయ్యిందనే ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఇంకొన్ని అలాంటివే చేసే స్ఫూర్తి వస్తుంది. కానీ ఇంత పెద్ద అనడం వెనుక స్ట్రాటజీ ఏమై ఉంటుందా అనే అనుమానం రాకమానదు.

అయితే ఒకరకంగా ఆలోచిస్తే దర్శకులు విజయ్ దేవరకొండను ఇంకా అర్జున్ రెడ్డి ఇమేజ్ లోనే చూపాలనే తాపత్రయంతో దర్శకులు కథలు రాసుకోవడం వల్లే ఫలితాలు కూడా తేడా కొడుతున్నాయని అందుకే ఫర్ ఏ చేంజ్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చనే మాట వినిపిస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ స్టేట్ మెంట్ కాస్త తొందరపడి ఇచ్చిందే. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో ఇప్పటికీపుడు మసాలా సినిమాలు ట్రై చేసినా రిస్క్. రొటీన్ హీరోయిజం అంతగా వర్క్ అవుట్ అవ్వని రోజులివి.

ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకునే విజయ్ ని అందరూ హీరోలు చేసే కథల్లో చూడటం కష్టమే. పోనీ చేస్తే ఎలా ఉంటుందో నోటా ఆల్రెడీ చూపించేసింది. కాబట్టి ప్రేమ కథలకు పూర్తిగా గుడ్ బై చెప్పకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ ఇవి కొనసాగించాలి. లేదంటే విజయ్ దేవరకొండ లవ్ స్టోరీస్ వద్దంటున్నాడు కాబట్టి అందరూ రొటీన్ కథలతో కలిసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్(రిజిస్టర్ చేసిన టైటిల్) చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ మధ్య మొదలై ఆగిపోయిన హీరో సినిమా ముచ్చట్లు మాత్రం చెప్పడం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి