iDreamPost

Pic Talk: ఈ బుడ్డోడు ఇప్పుడో స్టార్‌ హీరో! టాలీవుడ్‌కి నెక్ట్స్‌ బిగ్‌ స్టార్‌గా చెప్పుకుంటున్నారు!

  • Published Apr 05, 2024 | 1:59 PMUpdated Apr 05, 2024 | 1:59 PM

ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యే ఫోటోస్ స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న ఓ స్టార్ హీరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ బుడతడు ఎవరో గెస్ చేసేద్దాం.

ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యే ఫోటోస్ స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న ఓ స్టార్ హీరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆ బుడతడు ఎవరో గెస్ చేసేద్దాం.

  • Published Apr 05, 2024 | 1:59 PMUpdated Apr 05, 2024 | 1:59 PM
Pic Talk: ఈ బుడ్డోడు ఇప్పుడో స్టార్‌ హీరో! టాలీవుడ్‌కి నెక్ట్స్‌ బిగ్‌ స్టార్‌గా చెప్పుకుంటున్నారు!

ఎవరికైనా వారి వారి వృత్తిలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. బాల్యం మాత్రం మధుర జ్ఞాపకమే. అంబానీ అయినా.. అమితా బచ్చన్ అయినా చిన్న నాట ఎన్నో కష్టాలు పడితేనే కానీ.. ఈరోజున ఈ స్థాయికి వచ్చి ఉండరు. అలా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఉన్నారు. ఈ క్రమంలో వారంతా సోషల్ మీడియాలో ఎప్పుడో ఓసారి.. వారి వారి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ.. పోస్ట్ చేసిన వారి చిన్న నాటి ఫోటోలు.. కాస్త వాళ్ళ అభిమానుల క్యూరియాసిటీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో సినీ సెలెబ్రిటీల ఫోటోలు గెస్ చేస్తూ వస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు తన తండ్రి భుజాలపై ఉన్న ఓ బుడతడి ఫోటో నెట్టింట షికార్లు చేస్తుంది. మరి ఆ హీరో ఎవరో గెస్ చేసేద్దాం.

ఇండస్ట్రీలోకి కొంతమంది బ్యాక్గ్రౌండ్ తో వస్తే.. మరికొంతమంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తారు. అయితే, ఎవరు ఎలా వచ్చినా కానీ.. వాళ్ళని ఇండస్ట్రీలో నిలబెట్టేది మాత్రం కేవలం వారి కష్టం, అదృష్టం. ఇలా చాలా మంది వాళ్ళ వాళ్ళ కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను చూసి ఉంటారు. కానీ ఇప్పుడు కెరీర్ లో పీక్ హిట్స్ ను చూస్తుంటారు. ఈ ఫొటోలో ఉన్న బుడతడు కూడా ఈ కోవకు చెందిన వాడే. 2011 లో రవి బాబు దర్శకత్వంలో తెరకెక్కిన నువ్విలా చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆఫర్స్ కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఎన్నో సినిమాలలో ఆఫర్లు చేతికి వచ్చినట్టు వచ్చి పోయేవి.. అంతే కాకుండా కొన్ని సార్లు స్టేజ్ మీదే ఎన్నో విమర్శలకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, వాటి అన్నిటిని తట్టుకుని.. హిట్ చిత్రాలతో అందరిచేత రౌడీ బాయ్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఈ హీరో ఎవరో గుర్తోచేసి ఉంటుంది. ఆ బుడతడు మరెవరో కాదు.. ఇప్పుడు టాలీవుడ్ ను ఏలేస్తున్న స్టార్ హీరో “విజయ్ దేవర కొండ”

2016లో విడుదలైన పెళ్లి చూపులు సినిమాతో ఈ హీరో వెండి తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో విజయ్ కు మంచి రెస్పాన్స్ ఏ వచ్చినా కూడా.. ఇండస్ట్రీలో ఇతని మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా మాత్రం 2017లో విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా అని చెప్పి తీరాల్సిందే. ఆ తర్వాత విజయ్ రష్మీక కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాకు కూడా.. ఊహించని రెస్పాన్స్ లభించింది. అలా విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉన్నాడు. తాజాగా, ఏప్రిల్ 5న విజయ్ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ అయిన సందర్బంగా.. విజయ్ తన సోషల్ మీడియా ఖాతాలో మై ఫ్యామిలీ స్టార్ అంటూ.. తన తండ్రితో ఉన్న ఫోటోలను షేర్ చేసాడు. దీనితో ఆ పోస్ట్ కాస్త వైరల్ అవుతోంది. మరి, విజయ్ దేవరకొండ చైల్డ్ హుడ్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి