iDreamPost

కావాలని చేయలేదు.. క్షమించండి – విఘ్నేశ్ శివన్ లేఖ

కావాలని చేయలేదు.. క్షమించండి – విఘ్నేశ్ శివన్ లేఖ

నయనతార – విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఘనంగా జరిగింది. వీరిద్దరికీ తిరుమల వెంకన్నపై అపారమైన భక్తి ఉంది. అయితే తొందరపాటులో వాళ్ళు చేసిన పనే కొత్త వివాదానికి దారి తీసింది. నయన్ – విఘ్నేశ్ ల వివాహ అనంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చిన్న ఫొటోషూట్ చేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది.

శ్రీవారి ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగడం నిషేధం. ఆ పని ఎవరూ చేయరు. కానీ, నయన్ -విఘ్నేశ్ లు తమ ఫొటోషూట్ లో భాగంగా ఆ పని చేయడమే అసలు కారుణం. దీనిపై ముందుగా స్పందించిన టీటీడి అధికారులు వీరిద్దరిపై చర్యలకు సిద్ధపడ్డారు.

ఈ అంశంపై విఘ్నేశ్ శివన్ తాజాగా క్షమాపణలు కోరుతూ లేఖ రాశారు. దేవుడిపై తమకు అపారమైన భక్తి ఉందని, అది తమకే తెలియకుండా కంగారులో జరిగిన తప్పిదంగా భావించాలని విజ్ఞప్తి చేశాడు.

వాస్తవానికి నయన్ -విఘ్నేశ్ లు ఎప్పటి నుంచో తిరుమలలోనే తమ వివాహం జరగాలని అనుకున్నారు. అందుకోసం గత 30 రోజుల్లోనే 5సార్లు తిరుమలకు వచ్చారు. కానీ, అనుకోని కారణాల వల్ల వారి విహావ వేడుకను మహాబలిపురానికి మార్చాల్సి వచ్చింది.

వివాహం అనంతరం నేరుగా శుక్రవారం స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆ మధురక్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలోనే చిన్న ఫొటోషూట్ ప్లాన్ చేశారు. భక్తులు ఎక్కువగా ఉండటంతో తొందరగా ముగించాలనే కంగారులో కాళ్ళకు చెప్పులు ఉన్న సంగతి గమనించలేదని తన లేఖలో పేర్కొన్నాడు విఘ్నేశ్. తాము  కొలిచే స్వామిని అవమానించేందుకు ఈ పని చేయలేదంటూ క్షమాపణలు చెప్పాడు.

నిబంధనలకు విరుద్ధంగా చెప్పులతో మాడ వీధుల్లో తిరగడంతో భక్తులు చాలామంది దాన్ని గమనించి అభ్యంతరం చెప్పారు. పైగా ఏ అనుమతి లేకుండా ఫొటోషూట్ నిర్వహించడం పైనా నోటీసులు జారీ చేసింది టీటీడీ దీనికి సమాధానంగా అందరినీ క్షమాపణలు కోరాడు విఘ్నేశ్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి