iDreamPost
android-app
ios-app

Viral News: తండ్రి అంత్యక్రియల్లో కూతురుకి ప్రపోజ్ చేసిన పాస్టర్

  • Published May 18, 2022 | 3:01 PM Updated Updated May 18, 2022 | 3:01 PM
Viral News: తండ్రి అంత్యక్రియల్లో కూతురుకి ప్రపోజ్ చేసిన పాస్టర్

చావు కబురు చల్లగా సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠి భర్త చనిపోతే, ఆ కార్యక్రమానికి ‘అంతిమ యాత్ర’ డ్రైవర్ గా వెళ్లిన వెళ్లిన హీరో కార్తికేయ, ఆమెకు ఐలవ్వ్యూ అంటూ ప్రపోజ్ చేస్తాడు. అది సినిమా. నిజ జీవితంలో కూడా ఓవ్యక్తి అలాగే చేశాడు. కానీ ఇక్కడ లవ్ ప్రపోజ్ చేసింది చనిపోయిన వ్యక్తి భార్యకు కాదు, చనిపోయిన వ్యక్తి కూతురికి. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి తండ్రి చనిపోయి బాధ పడుతున్న కూతురికి లవ్ ప్రపోజ్ చేశాడు.

ఓ మహిళ తన తండ్రి అంత్యక్రియల కోసం స్మశానానికి వెళ్లింది. విషాదంలో ఉన్న ఆమె వద్దకు సౌత్ ఆఫ్రికా లింపోపో ప్రోవిన్స్ కు చెందిన పాస్టర్ వచ్చాడు. ఆమె అత‌ని గర్ల్ ఫ్రెండ్. ప్రియురాలు ఏడుస్తుంటే, తాను కూడా కన్నీరు పెట్టుకున్నాడు. ఆ టైంలో ఏమనిపించిందోగానీ, ఆమెకు ప్రపోజ్ చేశాడు. అక్కడే ఆమె ముందు మోకాళ్ల మీద కూర్చుని.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగాడు. అంతేకాదు ఆమె చేతికి ఉంగరాన్ని కూడా తొడిగాడు. ఆమె ఆ సమయంలో తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మ‌శానంలో ప్రపోజ‌ల్ ఏంట‌ని కొంద‌రు కామెంట్లు చేస్తుంటే, మరికొంతమంది తండ్రి పోయిన బాధలో ఉన్న ఆమెకు నేనున్నానని ధైర్యం చెబుతున్నాడ‌ని వేన‌కేసుకొచ్చారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler