iDreamPost
android-app
ios-app

రిలీజైన ఏడాది తర్వాత OTTలోకి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా

  • Published May 12, 2024 | 5:31 PM Updated Updated May 12, 2024 | 5:31 PM

గతేడాది జూన్ లో విడుదలై.. మంచి విజయం సాధించిన సినిమా ఒకటి సంవత్సరం తరవాత ఓటీటీల్లోకి రానుంది. ఆ వివరాలు..

గతేడాది జూన్ లో విడుదలై.. మంచి విజయం సాధించిన సినిమా ఒకటి సంవత్సరం తరవాత ఓటీటీల్లోకి రానుంది. ఆ వివరాలు..

  • Published May 12, 2024 | 5:31 PMUpdated May 12, 2024 | 5:31 PM
రిలీజైన ఏడాది తర్వాత OTTలోకి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా

ఈమధ్య కాలంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. దాంతో థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా కచ్చితంగా ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ఇక కొన్ని సినిమాలైతే.. నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఓటీటీలకు క్రేజ్ పెరుగుతుండటంతో.. ఆయ ప్లాట్ ఫామ్స్ కూడా విపరీతంగా ఖర్చ చేసి కొత్త కొత్త కంటెంట్ ని ప్రేక్షకుల కోసం తీసుకువస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలే కాక.. ఎప్పుడో రిలీజైన చిత్రాలు కూడా ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ హిట్టు సినిమా ఏడాది తర్వాత ఓటీటీల్లోకి వచ్చింది. ఇంతకు అది ఏ సినిమా.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది వంటి వివరాలు..

ఓ సినిమా థియేటర్లలో రిలీజైన రెండు మూడు వారాలకే ఓటీటీలోకి వస్తున్న రోజులివి. అలాంటిది ఈ మూవీ మాత్రం ఏకంగా ఏడాది తర్వాత ఇప్పుడు అందుబాటులోకి రానుంది. అదే బాలీవుడ్ హీరో కౌశల్, హీరోయిన్ సారా అలీ ఖాన్ జంటగా నటించిన సినిమా ‘జర హట్కే జర బచ్కే’. రొమాంటిక్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది అనగా.. 2023, జూన్ లో థియేటర్లలో రిలీజైంది. ఇందులో ‘తేరే వాస్తులే’ అనే పాట అప్పట్లో తెగ పాపులర్ అయింది. దీని మీద రీల్స్ తెగ చేశారు. ఇక ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని జియో సినిమా దక్కించుకోగా… స్ట్రీమింగ్ మాత్రం ఇప్పుడు ఏడాది తర్వాత చేస్తోంది. మే 17 నుంచి ఈ చిత్రం జియో సినిమాలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

కథ ఏంటంటే..

ఈ సినిమా కథ విషయానికొస్తే.. కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య (సారా) పెళ్లయిన కొత్త జంట. మిడిల్ క్లాస్ కుటుంబం కావడంతో వీళ్లకు బెడ్ రూమ్ ఇచ్చి, హాల్‌లో తల్లిదండ్రులు పడుకుంటూ ఉంటారు. అయితే భర్తతో సరదాగా గడుపుదామంటే అత్తమామ ఇంట్లోనే ఉన్నారని, కొత్తిల్లు తీసుకుందామని సౌమ్య అనుకుంటుంది. ఆవాస్ యోజన పథకం కోసం అప్లికేషన్ పెట్టడానికి వెళ్లి, అక్కడి అధికారితో కపిల్ గొడవపడతాడు. ఈ క్రమంలోనే చోటు చేసుకునే పరిణామాల కారణంగా కపిల్, సౌమ్యలు విడాకులు తీసుకుంటారు. అసలు వారి మధ్య గొడవలు ఏంటి.. విడాకులకు కారణం ఏంటి.. చివరు ఏం జరిగింది అంటే సినిమా చూడాలి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet