SNP
SNP
ఎంత మంచి వ్యవస్థ లేదా సంస్థ అయినా.. ఒక అవినీతిపరుడైన వ్యక్తి వల్ల సర్వనాశనం అవుతుందని టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశాడు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రసాద్ ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం కావడం లేదు. అసలు ఈ ట్వీట్ ఆయన ఎందుకు చేశారనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
వెంకటేశ్ ప్రసాద్ తన ట్వీట్‌లో ‘అవినీతి రహిత సంస్థ కృషిని తీసివేయడానికి, మొత్తం సంస్థ ప్రతిష్టను పాడుచేయడానికి ఒక అవినీతిపరుడైన, అహంకారి వ్యక్తి చాలు. అతని ప్రభావం కేవలం చిన్నగా కాదు, భారీగానే ఉంటుంది. రాజకీయాలు, క్రీడలు, జర్నలిజం, కార్పొరేట్ ఇలా అన్ని రంగాల్లో ఇదే నిజం.’ అంటూ పేర్కొన్నాడు. అసలు ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశిస్తూ చేశారని ఓ నెటిజన్ ఆడిన ప్రశ్నపై కూడా ప్రసాద్ స్పందించారు.
మరో ట్వీట్ చేస్తూ.. ‘అవినీతిపరుడైన ఒక వ్యక్తి.. తన సంస్థ మంచి పనిని ఎలా రద్దు చేయగలడనే దాని గురించి నేను మాట్లాడిన సాధారణ ట్వీట్ అది. అలాంటి ప్రక్రియ ఏ రంగంలోనైనా ప్రభావం చూపుతుంది. నేను ఇతర ట్వీట్లలో టిక్కెట్ల విషయంలో బీసీసీఐ అసమర్థత గురించి మాట్లాడటం వలన, ఇది కూడా బీసీసీఐ గురించి అనే గందరగోళానికి దారితీసింది.’ అంటూ ప్రసాద్ వివరణ ఇచ్చారు. అయితే.. ప్రసాద్ బీసీసీఐ సెక్రటరీ జైషా గురించే ఆ ట్వీట్ చేశారనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It takes one corrupt, arrogant guy to take away the hardwork of an otherwise non-corrupt organisation and spoil the reputation of an entire organisation & the impact isn’t just micro but at a macro level. This is true in every field, be it politics,sports, journalistm, corporate.
— Venkatesh Prasad (@venkateshprasad) September 10, 2023
ఇదీ చదవండి: ఫస్ట్ సెంచరీ వీరుడు.. ఫస్ట్ సిరీస్ గెలిపించిన భారత కెప్టెన్! ఎవరో తెలుసా?