iDreamPost

మందుబాబులకు అన్యాయం చేస్తే సహించం.. తాగుబోతుల సంఘం హెచ్చరిక!

వేసవిలో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైట్ బీర్ల కొరత బాగా ఉంది. దీంతో తాగుబోతుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మద్యంబాబులకు అన్యాయం చేస్తే సహించం అంటూ హెచ్చరించారు.

వేసవిలో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైట్ బీర్ల కొరత బాగా ఉంది. దీంతో తాగుబోతుల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మద్యంబాబులకు అన్యాయం చేస్తే సహించం అంటూ హెచ్చరించారు.

మందుబాబులకు అన్యాయం చేస్తే సహించం.. తాగుబోతుల సంఘం హెచ్చరిక!

ప్రస్తుతం మండే  ఎండలకు జనం అల్లాడిపోతున్నరు.  ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే బీర్ల వినియోగం భారీగా పెరిగింది. సమ్మర్ హీట్ కు తట్టుకునేందుకు అందరు మందుబాబులు బీర్లను నీళ్ల తాగేస్తున్నారు. ఇదే సమయంలో బీర్ల కొరతను కొందరు వ్యాపారులు అవకాశంగా మార్చుకుని ధరలు అమాంతం పెంచేస్తున్నారు. ఈక్రమంలో మందుబాబులకు అన్యాయం చేస్తే సహించేది లేదని  తాగుబోతుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. మరి.. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా కార్మిక సంఘం, టీచర్ల సంఘం, ఆటో యూనియన్, మహిళ సంఘం వంటి అనేక సంఘాలు ఉంటాయి. అవి వారి వారి వృతులను బట్టి ఏర్పడతాయి. అయితే మందుబాబులకు కూడా ఓ సంఘం ఉందని ఎవరైన అనుకుంటారు. అవును మీరు విన్నది నిజం…తాగుబోతులకు కూడా సంఘం ఉందట. అంతేకాక బీర్ల ధరలు పెంచినందుకు ఏకంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొట్రంగి తరుణ్ ఉన్నారు. ఆయన ఇటీవలే తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు.

అయితే ఆయన పర్యటన పొటిలికల్ క్యాపెయిన్ కి కాదు. మందుబాబులకు జరగుతున్న అన్యాయంపైన ప్రశ్నించేదుంకు వచ్చారంట. లిక్కర్ దుకాణాలను తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఆకస్మికంగా పరిశీలించాడు. కాటారం మండల కేంద్రంలోని తెలంగాణ వైన్స్, శ్రీనివాస వైన్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మందుబాబులు తరణ్ కి ఘనస్వాగతం పలికారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైన్స్ దోపిడీ కారణంగా మందుబాబులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఫైర్ అయ్యారు. రెండు వైన్స్ లు పక్క పక్కనే పెట్టుకుని, బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ అధికారులకు నిత్యం ముడుపులు ముడుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆరోపించారు.

విద్యా సంస్థలకు దగ్గరలో మద్యం దుకాణాలు నిర్వహిస్తుంటే.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తరుణ్ ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లైట్ బీర్లు దొరక్క మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల తిప్పలు మాములుగా లేవని, లైట్ బీర్ల డిమాండ్ కు తగినట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. తరుణ్ తో పాటు కలిసి మందుబాబులు బీర్ల కోసం ధర్నాకు దిగారు. అన్ని మద్యం దుకాణల ముందు లైట్ బీర్ లు అమ్మకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు నిర్వహిస్తామని ఆమె హెచ్చరించారు. వేసవి కాలంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకం జరిగింది. చాలా ప్రాంతాల్లో బీర్ల కొరత ఏర్పడింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి