iDreamPost

అల్లరి నరేష్ తో మళ్ళీ నారీ నారీ నడుమ మురారి

బాలయ్య నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నిర్మాతలలోనే విలక్షణమైన అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుపడ్డ కాట్రగడ్డ మురారి నిర్మించిన సూపర్ డూపర్ హిట్....నారీ నారీ నడుమ మురారి.

బాలయ్య నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నిర్మాతలలోనే విలక్షణమైన అభిరుచి ఉన్న నిర్మాతగా పేరుపడ్డ కాట్రగడ్డ మురారి నిర్మించిన సూపర్ డూపర్ హిట్....నారీ నారీ నడుమ మురారి.

అల్లరి నరేష్ తో మళ్ళీ నారీ నారీ నడుమ మురారి

1990లో విడుదలైన బాలక్రిష్ణ స్టారర్ నారీ నారీ నడుమ మురారి సినిమాని ఎవ్వరూ మరచిపోలేరు. ముఖ్యంగా బాలయ్య ఫేన్స్. అంత పెద్ద హిట్. కెవి మహదేవన్ చేసిన సంగీతం, ఆ పాటలు అపాతమథురాలు. ఊరూరా, వాడవాడలా మారుమోగిపోయాయి. చాలా మంది ప్రముఖ రచయితలు పనిచేశారు. యువచిత్ర అనే ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రమిది. నిర్మాతలలోనే విలక్షణమైన అభిరుచి, వ్యక్తిత్వం ఉన్న నిర్మాతగా పేరుపడ్డ కాట్రగడ్డ మురారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సూపర్ డూపర్ హిట్.. నారీ నారీ నడుమ మురారి.

అంతకుముందు కె. మురారి నిర్మించిన సీతామహలక్ష్మి, గోరింటాకు, అభిమన్యుడు, సీతారామకళ్యలాణం, శ్రీనివాస కళ్యాణం, త్రిశూలం సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల రివార్డులు, బాక్సాఫీసు రికార్డులు సాధించి, తెలుగు సినీపరిశ్రమలో కె. మురారికి ఎనలేని కీర్తిప్రతిష్టలను తీసుకువచ్చాయి. అయితే ఇప్పటి తాజా వార్త ఏంటంటే.. యువచిత్ర బ్యానర్ మీద ఇన్ని గొప్ప సినిమాలు తీసిన మురారి చాలా కాలం సినిమాలు తీయడం మానేశారు. చిత్రపరిశ్రమలోని మారిపోయిన వ్యవహారాలు, వ్యక్తిత్వాలతో ఇమడలేక, రాజీపడలేక ఆయన పూర్తిగా అస్త్రసన్యాసం చేసి ఇంటికే పరిమితమైపోయారు.

Nari Nari Naduma Murari again with Allari Naresh

కొంతకాలం రాజశేఖర్ హీరోగా సినిమా చేద్దామనుకుని కూడా వర్కవుట్ కాకపోవడంతో మానుకున్నారు. ఇప్పుడు యువచిత్ర బ్యానర్ని పునరుద్ధరించడానికి మురారి కొడుకు కాట్రగడ్డ కార్తీక్ పూనుకున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి నారీ నారీ నడుమ మురారి సినిమాతోనే శ్రీకారం చుట్టాలని, అల్లరి నరేష్ ని సంప్రదిస్తే నరేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.అల్లరి నరేష్ కైతే నారీ నారీ నడుమ మురారి సుపర్బ్ గా సూటవుతుంది. కామెడీ, ఎంటర్ టైన్ మెంటు, పంచ్ డైలాగులకి కొదవ ఉండదు. పైగా అత్తా అల్లుడు కీచులాటలకి ఈ మధ్య తెలుగు సినిమాలు పూర్తిగా దూరమయ్యాయి. అహంకారపు అత్త, అల్లరి అల్లుడు కంటెంటె బాగా సేల్ అవుతుందిప్పుడు. సంగీతం కీరవాణిని ఎంపిక చేసుకున్నారని టాక్.

బాలయ్య నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమాకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పుడప్పుడే లైమ్ లైట్ లోకి వస్తున్న శోభన, నిరోషలను మురారి హీరోయిన్స్ గా పెట్టారు. మార్కెట్ లో ఉన్నా ఏ పెద్ద హీరోయిన్ని ఆశ్రయించలేదు. మురారిగారి చాదస్తం అనిపించుకున్న ఆయన క్రమశిక్షణ, డీప్ ఇన్వాల్వ్ మెంట్ ఆప్ స్టోరీ మేకింగ్ కి తట్టుకోలేక చాలా మంది రచయితలు, వచ్చి మళ్ళీ పారిపోయారు. అప్పటికి మురారి తీసిన సినిమాలన్నిటికీ అద్భతమైన సంగీతాన్ని సమకూర్చిన మహదేవన్నే నారీనారీ నడుమ మురారి సినిమాకి సంగీతం చేసి, తన మార్కు హిట్ స్టాంపుని వేశారు.

Nari Nari Naduma Murari again with Allari Naresh

సినిమాకి పని చేయకపోయినా, క్లైమాక్సు ఎలా ఉండాలి అన్న విపరీతమైన చర్చ జరిగినప్పుడు ప్రముఖ దర్శక రచయిత జంధ్యాల క్లైమాక్సుని అందించి, అందులో శ్రీ వేంకటేశ్వరుడికి తానే డబ్బింగ్ చెప్పారు. ఆ డైలాగులు కూడా రాసిందాయనే. ముఖ్యంగా మనసు కవి పల్లవి మాత్రమే రాసి, ఆయన మరణించారు. ఆ పాట….ఇరువురి భామల పాట పల్లవి రాసింది ఆత్రేయే. కానీ, పల్లవి తర్వాత పాటని రాసి పూర్తి చేసింది వేటూరి సుందరరామ్మూర్తి. తనికెళ్ళ భరణికి ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఓ పెద్ద హీరో సినిమాలో అవకాశం లభించిందంటే ఇందులోనే.

ఈ సినిమా టైంకి సూపర్ హిట్స్ తో రన్ అవుతున్న ఎ. కోదండరామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న సినిమాని, అంతటి రికార్డులను సొంతం చేసుకున్న యువచిత్ర బ్యానర్ని పునరద్ధరిస్తూ పునర్మించడానికి పూనుకున్న కాట్రగడ్డ కార్తీక్ కెరీర్ సక్సెస్ ఫుల్ కావాలని కోరుకుందాం. హిట్ మీద హిట్ కొడుతూ సాగుతున్న అల్లరి నరేష్ చేస్తేనే కరెక్టు ఈ సినిమాని. నిజానికి అల్లరి అని టైటిల్ ఉన్న నరేష్ అల్లరికీ సినిమా నూటికి నూరుపాళ్ళు యాప్ట్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి