iDreamPost

మల్లెపూలు మూడ్ కోసమే కాదు.. వేరే ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

మల్లెపూలు అంటే కేవలం మూడ్ రావడానికే పెట్టుకుంటారు.. భర్తలను ఆకర్షించడానికే పెట్టుకుంటారు అని అని అనుకుంటారు చాలా మంది. కానీ దీని వెనుక ఉన్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎవరికీ తెలియవు.

మల్లెపూలు అంటే కేవలం మూడ్ రావడానికే పెట్టుకుంటారు.. భర్తలను ఆకర్షించడానికే పెట్టుకుంటారు అని అని అనుకుంటారు చాలా మంది. కానీ దీని వెనుక ఉన్న ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఎవరికీ తెలియవు.

మల్లెపూలు మూడ్ కోసమే కాదు.. వేరే ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?

ఒకప్పుడు కొత్తగా పెళ్ళైన వ్యక్తి తన భార్య కోసం మల్లెపూలు తీసుకుని వెళ్లేవారు. అయితే మల్లెపూలు అంటే కేవలం మూడ్ పెరగడం కోసమే కాదు. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇప్పుడు భార్యకు మల్లెపూలు కొని పట్టుకెళ్ళేవాళ్ళే లేరనుకోండి. అది వేరే విషయం. అయితే అసలు ఈ కల్చర్ ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో అనేది తెలుసుకుంటే మల్లెపూల వల్ల కలిగే ప్రయోజనాలను మీరు కోల్పోతున్నారన్న విషయం అర్థమవుతుంది.  

ఆడవాళ్లు ఏ పూలు పెట్టుకున్నా గానీ మంచిదే. అయితే మల్లెపూలు పెట్టుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెళ్ళైన ఆడవారు భర్తలను తమవైపు ఆకర్షించడానికే మల్లెపూలు పెట్టుకుంటారని.. సినిమాల్లో గానీ, బయట సమాజంలో గానీ చిత్రీకరిస్తూ వచ్చారు. నిజానికి మల్లెపూలు పెట్టుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు వేరే. మల్లెపూలు పెట్టుకోవడం అంటే ఆయుర్వేద సాధన అని చెబుతారు. 

ఫస్ట్ నైట్ సమయంలో మల్లెపూల వల్ల ప్రయోజనాలు:

మొదటి రాత్రి అప్పుడు దంపతుల మధ్య బంధం బలపడేందుకు మల్లెపూలు బాగా సహకరిస్తాయి. మల్లెపూల వాసన మెదడుని ప్రశాంతంగా ఉంచుతుంది. పడక గదిలో మంచం మీద ఉన్నప్పుడు టెన్షన్ ని దూరం చేస్తుంది. సిగ్గు, భయాన్ని తొలగిస్తుంది. వెంటనే స్కలనం కాకుండా ఉంటుంది. బెడ్ మీద మల్లెపూలు చల్లడం వల్ల.. ఆ సువాసనను దంపతులు పీల్చడం వల్ల ప్రశాంతంగా ఉండడమే కాక ఉత్తేజంగా, ఆనందంగా ఉంటారు. మల్లెపూల వల్ల భార్యకు, భర్తకు ఇద్దరికీ ప్రయోజనమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

ఫస్ట్ నైట్ లోనే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు:

Did you know that jasmine flowers are not just for mood

సాంప్రదాయ పరంగా, మతపరంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఔషధ పరంగా మల్లెపూల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందానికి, ఆనందానికి, గాఢమైన ఆప్యాయతకు, పొందికకు చిహ్నంగా ఈ మల్లెపూలను పరిగణిస్తారు. అయితే ఈ మల్లెపూలను ఎక్కువగా చనుబాలు ఇచ్చే స్త్రీలు ధరించేవారు. ఈ స్త్రీలు మల్లెపూలను తలలో పెట్టుకోవడం వల్ల బిడ్డకు కావాల్సిన పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల లాక్టేషనల్ అమెనోరియా పెరగడమే కాకుండా.. పాల ఉత్పత్తికి కావాల్సిన గాలాక్టోపోయిసిస్ స్థాయి పెరుగుతుంది. అలానే ఈ మల్లెపూలు ధరించడం వల్ల చల్లగా ఉంటుంది. మల్లెపూలు పుర్రె వేడిని జుట్టు ద్వారా గ్రహించి.. బయటకు పంపించేస్తాయి. చల్లదనం కోసం మల్లెపూలు ధరించేవారు.

పూర్వం మగాళ్లు కూడా మల్లెపూలు ధరించేవారట. అప్పట్లో వారి జుట్టు పొడవుగా ఉండేదట. అయితే ఫ్యాషన్ కారణంగా మగాళ్లు మల్లెపూలు పెట్టుకోవడం మానేశారు. ఈ మల్లెపూల వాసనకు నిద్రలేమి సమస్య తగ్గుతుందని.. మెడిసిన్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూల వాసనకు మత్తు కలుగుతుంది. అతి కోపాన్ని తగ్గించే గుణం మల్లెపూలలో ఉన్నాయని చెబుతున్నారు. చిరాకు, కోపం వంటి వాటిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అలానే స్త్రీలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా.. దంపతుల మధ్య బంధం బలంగా ఉండడంలో మల్లెపూలు సహకరిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మల్లెపూలను ఈరోజుల్లో ఎంతమంది ధరిస్తున్నారు? ఎంతమంది మగవాళ్ళు తమ భార్యలకు మల్లెపూలు తీసుకెళ్తున్నారు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి