SNP
దాదాపు 13 ఏళ్ల క్రితం ఇండియన్ క్రికెట్‌లోకి ఒక సంచలనంలా దూసుకొచ్చిన బౌలర్.. ఒక స్టార్‌లా వెలిగిపోతాడని అంతా భావించారు. కానీ, అతను ఆశించిన స్థాయిలో రాణించలేక.. ఒక అనామక బౌలర్‌లా రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో పూర్తిగా తెలుసుకుందాం..
దాదాపు 13 ఏళ్ల క్రితం ఇండియన్ క్రికెట్‌లోకి ఒక సంచలనంలా దూసుకొచ్చిన బౌలర్.. ఒక స్టార్‌లా వెలిగిపోతాడని అంతా భావించారు. కానీ, అతను ఆశించిన స్థాయిలో రాణించలేక.. ఒక అనామక బౌలర్‌లా రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనెవరో పూర్తిగా తెలుసుకుందాం..
SNP
అతని బౌలింగ్ చూసి.. ఇండియన్ క్రికెట్‌కు ఒక డెయిల్ స్టెయిన్ దొరికాడని, ప్రపంచ క్రికెట్‌లో స్టార్‌గా వెలిగిపోతాడని అంతా భావించారు. సరిగ్గా అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే.. ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా ఎలాంటి స్టార్‌డమ్‌ను ఇండియన్ క్రికెట్‌లో అనుభవిస్తున్నాడో అంతకంటే ఎక్కువ స్టార్‌డమ్‌నే ఈ స్టార్ బౌలర్ అనుభవించేవాడు. కానీ, గాయాలతో తన కెరీర్‌ను ఎక్కువ రోజులు కొనసాగలేకపోయాడు. టీమిండియాలోకి అలా వచ్చి ఇలా వెళ్లాడు. ప్రస్తుతం దేశవాళి టోర్నీ రంజీల్లో ఆడుతున్న అతను తాజాగా రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనే.. వరణ్ అరోన్.
2011లో టీమిండియాలోకి మెరుపులా దూసుకొచ్చిన వరుణ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు గాయాలు ఇబ్బంది పెట్టడంతో జట్టుకు దూరం అయ్యాడు. టీమిండియా తరఫున 2015లో చివరి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు దక్కలేదు. ప్రస్తుతం రంజీలో జార్ఖండ్ తరఫున ఆడుతున్న వరుణ్.. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్‌లో చివరి మ్యాచ్ అంటూ సంచలన ప్రకటన చేశాడు. బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదంటూ వరుణ్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
2011 నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అలాగే అక్టోబర్‌లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో వైట్ బాల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన కెరీర్‌లో టీమిండియా తరఫున 9 టెస్టులు ఆడిన వరుణ్ 18 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 9 వన్డేలు ఆడి 11 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ 52 మ్యాచ్‌లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఇతనికి ఐదు వికెట్ల హాల్ లేదు. ఇలా అంతర్జాతీయ క్రికెట్‌లోకి దూసుకొచ్చిన వరుణ్.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకుండానే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మరి వరుణ్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Varun Aaron has announced his retirement from First Class cricket. pic.twitter.com/NGYIAzr9p0
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 16, 2024