iDreamPost

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. కావాల్సిన వస్తువులు ఇవే!

వరలక్ష్మీ వ్రతం పూజా విధానం.. కావాల్సిన వస్తువులు ఇవే!

శ్రావణ మాసం అంటే పండుగలు, వ్రతాలు జరుపుకునే మాసంగా హిందువులు పరిగణిస్తారు. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికీ ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు వరాలిచ్చే తల్లి వర మహాలక్ష్మిని ఎవరైతే  భక్తి శ్రద్ధలతో కొలుస్తారో.. వారందరికి కోరికలు తీరుస్తుంది. సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు సహధర్మచారిణీ అయినా లక్ష్మీదేవి అష్టావతరాల్లో వరలక్ష్మీ ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు నియమ,నిష్టలతో ఉండాలి. అమ్మవారి వ్రతాన్ని భక్తి శ్రధ్దలతో జరుపుకుంటే.. ఆమె కరుణ ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే వరలక్ష్మీ అమ్మవారి వ్రతంలో ఉపయోగించే వస్తువులు చాలా ప్రధానమైనవి. మరి.. అమ్మవారి పూజకు కావాల్సిన వస్తువులు  ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్రావణమాసం లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలని పండితులు అంటారు. శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఈ దేవత వరాలు ఇచ్చే దేవత కాబట్టి వరలక్ష్మి అయ్యింది. అయితే వరలక్ష్మీ వ్రతాన్ని లేదా పూజను ఎంతో నిష్టగా, భక్తి శ్రద్దలతో చేయాలి. సూర్యోదయం ముందే నిద్ర లేవాలి ఇంటి పనులు పూర్తి చేసుకొవాలి. అనంతరం ఆవు పేడతో కల్లాపు జల్లి ముగ్గుతో గడపను అలంకరించుకోవాలి. ఇంటిలో ఉన్న గడపలు అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి.

మామిడి తోరణాలు పువ్వులు తోరణాలతో ద్వారాలను అలంకరించుకోవాలి. ఇక తల స్నానం చేసిన తరువాత అమ్మవారి పూజకు సిద్దం కావాలి. అయితే పూజకు కావాలిన వస్తువులు కూడా చాలా ప్రధానమైనవి. అమ్మవారి పూజకు కలశం అనేది ప్రధానమైనది. కలశం అనేది ఎందుకు పెడతారు అంటే వ్రతం ఆచరించడానికి కలశం ఏర్పాటు చేసి.. వ్రతంలో కోరుకున్న కోరిక ఏదైనా నెరవేరుతుందనేదని అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ కలశ స్థాపనకు ముందుగా ఆ పీటపై బియ్యం పోసి నూతన వస్త్రం వేసి దానిపై కలశ చెంబును పెట్టాలి. ఆ కలశం చుట్టూ మారేడు, నేరేడు, మామిడి, మర్రి, వెలగ ఆకులను అలంకరించాలి.

అలానే ఎర్రని రవిక వస్త్రాన్ని చుట్టిన కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి.. కలశంపై స్థాపన చేసుకోవాలి. ఆ పక్కనే మీ స్థాయికి తగ్గట్టుగా ఇంట్లో ఉన్న బంగారం పాలతో నేలతో కడిగి.. అమ్మ దగ్గర అలంకరించుకోవాలి. పూజకు ముఖ్యంగా ఐదు రకాల పళ్ళు,  ఐదు రకాల పువ్వులు, ఐదు రకాలు నైవేద్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పాలు బెల్లంతో చేసిన పరమాన్నం అమ్మకి చాలా ఇష్టం. పసుపు కుంకుమ హారతి అగరబత్తి నాకు చెక్క సాంబ్రాణి, మీ స్థోమత కొలది ముత్తయిదువులకు తాంబూలం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే.. కోరుకున్న కోరికలు నిరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి