iDreamPost

వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌: నెలకు రూ. 2లక్షల ఆదాయం.. అయినా ఇవేం పనులు అనురాధ

  • Published Sep 14, 2023 | 5:35 PMUpdated Sep 14, 2023 | 5:35 PM
  • Published Sep 14, 2023 | 5:35 PMUpdated Sep 14, 2023 | 5:35 PM
వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌: నెలకు రూ. 2లక్షల ఆదాయం.. అయినా ఇవేం పనులు అనురాధ

నగరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వరలక్ష్మి టిఫిన్స్‌ సెంటర్‌లో డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మి టిఫిన్స్‌ ఓనర్‌ ప్రభాకర్‌ రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనురాధ అనే మహిళ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనురాధ ఎప్పటి నుంచో గోవా నుంచి అక్రమంగా నగరానికి డ్రగ్స్‌ తీసుకువచ్చి.. వాటిని ఇక్కడ విక్రయించేది. ఈ క్రమంలో ఆమెకు వరలక్ష్మి టిఫిన్స్‌ ప్రభాకర్‌ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇక అనురాధను విమానంలో గోవా పంపి.. అక్కడి నుంచి బస్‌ మార్గం ద్వారా.. నగరానికి డ్రగ్స్‌ తెప్పించేవాడు ప్రభాకర్‌ రెడ్డి. ఆ తర్వాత వాటిని విక్రయించేవారు. ప్రస్తుతం వీరంతా పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ క్రమంలో కిలేడీ అనురాధ గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు నెలకు 2 లక్షల వరకు ఆదాయం వస్తున్నప్పటికి.. అనురాధ ఇలాంటి పనులు చేయడం చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.

కిలేడీ అనురాధ వివరాలు..

డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందుతుల్లో అనురాధ ఒకరు. ఆమె స్వస్థలం.. కరీంనగర్ జిల్లా గన్నేరుగూడ. ఎంబీఏ పూర్తి చేసిన అనురాధ.. కొంతకాలం క్రితం ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ వచ్చింది. నానక్‌‌‌‌రాంగూడ టీఎన్‌‌‌‌జీవోస్ కాలనీలో నివాసం ఉండేది. ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేది. మంచి జీతంతో పాటు సొంతూరిలో ఉన్న దుకాణాల అద్దెల ద్వారా నెలకు రూ.60 వేల ఆదాయం లభించేది. ఇదే కాక.. అనురాధ తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో.. అతడికి ప్రతి నెలా పెన్షన్‌‌‌‌ రూపంలో రూ.20 వేలు వచ్చేవి. ఇలా మొత్తంగా చూసుకుంటూ.. ప్రతి నెలా అనురాధకు దాదాపు రూ.2 లక్షల దాకా ఆదాయం వస్తుంది. ప్రేమ వివాహం చేసుకున్న అనురాధ.. విభేదాల కారణంగా కొంతకాలం తర్వాత.. భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో క్రమంగా చెడు వ్యసనాలు, డ్రగ్స్‌‌‌‌కు బానిసై వీకెండ్‌‌‌‌ పార్టీలు, పబ్స్‌‌‌‌, గోవా టూర్స్‌‌‌‌కి వెళ్లేది.

గోవాలో అనురాధకు నైజీరియాకు చెందిన జేమ్స్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో నగరానికి తీసుకువచ్చేది అనురాధ. జేమ్స్ దగ్గర పది వేలకు ఒక గ్రాము చొప్పున డ్రగ్స్ కొనుగోలు చేసేది. నగరానికి వచ్చిన తర్వాత.. ఇక్కడ డిమాండ్‌ను బట్టి ఒక్కో గ్రాము 20 వేలకు పైగా విక్రయించి సొమ్ము చేసుకునేది. ఈ క్రమంలోనే వరలక్ష్మి టిఫిన్స్‌‌‌‌ ఓనర్ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. డ్రగ్స్‌కు బానిసైన ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. అనురాధ నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాత్రి సమయాల్లో ఇద్దరూ కలిసి హోటల్‌‌‌‌లోనే డ్రగ్స్ తీసుకునేవారని పోలీసులు తెలిపారు.

ఇలా ఉండగానే.. పల్లెటూరు పుల్లట్లు హోటల్‌‌‌‌కు చెందిన వెంకటశివ సాయికుమార్‌‌‌‌‌‌‌‌కు కూడా అనురాధ డ్రగ్స్ అలవాటు చేసిందని పోలీసులు తెలిపారు. ప్రభాకర రెడ్డి, శివకూమార్‌లకు అనురాధ తరచుగా డ్రగ్స్ సప్లయ్ చేసేదని.. టిఫిన్ సెంటర్స్‌‌‌‌లోనే ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి వీరు డ్రగ్స్‌‌‌‌ తీసుకునేవారని పోలీసులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా వచ్చిన డబ్బులో అనురాధ మేజర్ షేర్ తీసుకునేదని పోలీసులు వెల్లడించారు.

ఇలా రెండు టిఫిన్ సెంటర్స్‌‌‌‌కు వచ్చే వారిని కూడా అనురాధ ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. టిఫిన్ సెంటర్ల ఓనర్లు, అనురాధ వాట్సాప్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్స్‌‌‌‌ ఆధారంగా కస్టమర్ల డేటా కలెక్ట్ చేస్తున్నారు. గోవాలో ఉన్న జేమ్స్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను అక్కడకు పంపారు పోలీసులు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి