iDreamPost

అంగరంగ వైభవంగా వంగవీటి రాధా కృష్ణ వివాహం

విజయవాడ అనగానే గుర్తుకువచ్చే పొలిటికల్ ఫ్యామిలీ వంగవీటి మోహన రంగ. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఆ నేతను ప్రజలు తమ మనిషిగా భావించారు. ఏదైనా కష్టమెస్తే తానున్నానని ముందుండేవాడు. అందుకే వంగవీటి రంగ అంటే వల్లమాలిన అభిమానం జనాలకు. ఇప్పుడు ఆ ఇంట్లో శుభకార్యం జరిగింది.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ వివాహం విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగింది. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం అమ్మాణి, బాజ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లిని మనువాడారు రాధా. విజయవాడకు సమీపంలోని పోరంకి మురళీ రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి (అక్టోబర్ 22)న ఈ వేడుక జరిగింది. వధూవరూలను ఆశీర్వదించేందుకు భారీగా జన సందోహం తరలి వచ్చారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు రంగ అనుచరులు, ఆయా పార్టీలకు చెందిన నేతలు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. రాధాకృష్ణ, పుష్పవల్లికి ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 22న మూడు ముళ్లతో ఏకమయ్యారు ఈ జంట. తొలి నుండి రాధా పార్టీలకతీతంగా స్నేహ బంధం కొనసాగిస్తున్న సంగతి విదితమే.

ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోన్ తదితరులు విచ్చేసి.. వధూవరులను ఆశీర్వదించారు. విజయవాడే కాకుండా ఏపీ వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగాను దేవుడిలా కొలుస్తారు. తన తండ్రి వారసత్వాన్ని తీసుకున్న రాధా కృష్ణ కాంగ్రెస్ పార్టీ తరుఫున 2004లో బెజవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓటడి చెందారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన ఆయన.. 2019లోటీడీపీలో చేరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి