iDreamPost
android-app
ios-app

వంగవీటి రాధా పెళ్లి డేట్ ఫిక్స్.. వైరలవుతోన్న శుభలేఖ

  • Published Oct 08, 2023 | 12:14 PM Updated Updated Oct 08, 2023 | 12:14 PM
వంగవీటి రాధా పెళ్లి డేట్ ఫిక్స్.. వైరలవుతోన్న శుభలేఖ

వంగవీటి అభిమానులు, బంధువులు ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న వంగవీటి రాధా వివాహానికి సమయం ఆసన్నమైంది. వంగవీటి వారసుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కాగా ప్రస్తుతం వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్టోబర్ 22వ తేదీ ఆదివారం రాత్రి 7.59 నిమిషాలకు శ్రవణా నక్షత్రయుక్త వృషభ లగ్నం నందు నవ వధూవరులు రాధ, పుష్పవల్లిలు ఒక్కటయ్యేందుకు ఇరుపక్షాల పెద్దలు శుభ ముహూర్తాన్ని ఖరారు చేశారు. వీరి వివాహము విజయవాడ – నిడమానూరు పోరంకి రోడ్డు లోని మురళి రిసార్ట్స్‌లో జరుగనుంది. ఇదిలా ఉంటే నరసాపురానికి చెందిన జక్కం బాబ్జి శ్రీమతి అమ్మాణి ల కుమార్తెతో రాధా కృష్ణ ఎంగేజ్మెంట్ సెప్టెంబర్ 3 వ తేదీన అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

కాగా ఇప్పటికే ఇరువైపులా బంధువులకు, స్నేహితులకు, రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం. వివాహానికి హాజరయ్యే రంగా, రాధా అభిమానులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల సౌకర్యాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వంగవీటి రాధా కృష్ణ ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయినప్పటికీ పార్టీ కార్యాక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. రాధాకి కాబోయే భార్య కూడా రాజకీయ నేపథ్యమున్న కుటుంబమే. జక్కం అమ్మాని 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş