iDreamPost
android-app
ios-app

వీడియో: వైష్ణవి సెలబ్రేషన్ వీడియో రిలీజ్! అదరగొట్టేసింది!

వీడియో: వైష్ణవి సెలబ్రేషన్ వీడియో రిలీజ్! అదరగొట్టేసింది!

“బేబీ” ఈ మధ్య కాలంలో పెద్ద విజయాన్ని అందుకున్న చిన్న సినిమా .  రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. ఏకంగా 90కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. కథ, కథనం అంతా నేటి యువత మానసిక స్థితిని తెలియజేస్తూ ఉండటం, వారికి కనెక్ట్ అయ్యే రీతిలో మూవీని తెరకెక్కించడం “బేబీ” విజయానికి కారణం అయ్యింది. సాయి రాజేష్ దర్శకత్వ ప్రతిభకి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అద్భుత నటన తోడవ్వడంతో “బేబీ” బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది. ఇక ఈ సినిమా సక్సెస్ తో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ప్రస్తుతం ఈమెకి చాలానే మూవీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇక తమ హీరోయిన్ కి ఇంతటి క్రేజ్ రావడంతో మూవీ యూనిట్ తాజాగా వైష్ణవి సెలబ్రేషన్ వీడియోని రిలీజ్ చేసింది. ఇది సినిమాలో ఆమె ఇంట్రెడెక్షన్ సీన్ కావడం గమనార్హం.

“బేబీ” ఈ నెల 25 నుండి “ఆహా”లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వీడియోస్ సాంగ్ రిలీజ్ చేసినట్టు అర్ధం అవుతోంది. ఇక ఈ ఇంట్రెడెక్షన్ వీడియోలో వైష్ణవి మాస్ స్టెప్స్ ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నాయి. ధియేటర్స్ లో సినిమా చూసిన వారు కూడా ఈ వీడియోని మళ్ళీ వైరల్ చేస్తుండటం విశేషం. దసరా మూవీలో కీర్తి సురేష్ స్టెప్స్ ని గుర్తు చేస్తూ.. వైష్ణవి డ్యాన్స్ అదరగొట్టడం విశేషం. ఇక “బేబీ” ఓటీటీ రైట్స్ కూడా భారీ ధర పలికినట్టు సమాచారం. మరి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన  వైష్ణవి సెలబ్రేషన్ వీడియోపై మీరు ఓ లుక్కు  వేయండి.

ఇదీ చదవండి: శ్రీలీల విషయంలో మహేష్ బాబు టెన్షన్! ఇది కదా సక్సెస్ అంటే!

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş