venkateswarlu
సాధారణంగా గర్భాశయం అన్నది ఆడవారికి సంబంధించిన అవయవం. గర్భాశయం ఉన్న మహిళలు మాత్రమే పిల్లల్ని కనడానికి వీలు ఉంటుంది. ఒక్కోసారి జెనటిక్ సమస్య కారణంగా మగవాళ్లలో కూడా గర్భాశయం వెలుగు చూస్తూ ఉంటుంది. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. తాజాగా, ఓ యువకుడి కడుపులో గర్భశయాన్ని గుర్తించారు డాక్టర్లు. గంటన్నరపాటు కష్టపడి దాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఛత్తీష్‌గఢ్‌లోని ధమ్‌తరీకి చెందిన ఓ యువకుడు కడుపులో సమస్య కారణంగా కొన్ని రోజుల క్రితం ఆస్పత్రికి వెళ్లాడు. అతడ్ని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ఆడవారిలో ఉండాల్సిన గర్భాశయాన్ని అతడి కడుపులో గుర్తించారు. ఆపరేషన్ చేసి దాన్ని బయటకు తీసేయాలని అన్నారు. యువకుడి కుటుంబసభ్యులు ఒప్పుకోవటంతో కొద్దిరోజుల క్రితం ఆపరేషన్ చేశారు. దాదాపు గంటన్నరపాటు ఈ ఆపరేషన్ జరిగింది. ఇంకా ఎదగని స్థితిలో ఉన్న గర్భాశయాన్ని బయటకు తీశారు.
మరికొన్ని రోజులు అతడికి చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఛత్తీష్‌గఢ్ రాష్ట్రంలో ఇలాంటి కేసు మొట్టమొదటిదని అంటున్నారు. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటి వరకు 300 మాత్రమే నమోదయ్యాయని అన్నారు. కొద్దిరోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి కడుపులోనూ గర్భాశయన్ని గుర్తించినట్లు తెలిపారు. మరి, యువకుడి కడుపులో గర్భాశయం బయటపడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.