iDreamPost
android-app
ios-app

ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత దీనంగా వేడుకుంటున్న ఊర్వశి రౌటేలా

  • Published Oct 15, 2023 | 5:03 PM Updated Updated Oct 15, 2023 | 5:03 PM
  • Published Oct 15, 2023 | 5:03 PMUpdated Oct 15, 2023 | 5:03 PM
ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత దీనంగా వేడుకుంటున్న ఊర్వశి రౌటేలా

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా శనివారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. దాదాపు లక్షకు పైగా ఆడియన్స్‌ ఈ మ్యాచ్‌ను స్టేడియంలో వీక్షించారు. ఈ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా గెలివడంతో వారంతా సంతోషంగా ఇళ్లకు చేరుకున్నారు. అయితే.. కమాన్‌ ఆడియన్స్‌తో పాటు ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ చాలా మంది సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. వారిలో బాలీవుడ్‌ బ్యూటీ, తెలుగు సినిమాల్లోనూ ఐటామ్‌ సాంగ్స్‌ల్లో మెరుస్తున్న హాట్‌ గర్ల్‌ ఊర్వశి రౌటేలా కూడా ఉన్నారు. అయితే.. ఆమె మాత్రం మ్యాచ్‌ తర్వాత కొంత నిరాశతో ఇంటికి తిరిగివెళ్లారు.

అయితే ఊర్వశి మాత్రం చాలా బాధతో తిరిగి వెళ్లింది. అందుకు కారణం.. ఆమె స్టేడియంలో 24 క్యారెట్ల బంగారం అలాగే, తన ఐఫోన్‌ పొగొట్టుకుంది. ఈ విషయాన్ని ఊర్వశినే స్వయంగా తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించింది. ఎవరికైనా తన వస్తువులు దొరికితే తెచ్చి ఇవ్వమని కూడా కోరింది. అయితే.. ఇండియా-పాకిస్థాన్‌ లాంటి క్రేజీ మ్యాచ్‌ చూసేందుకు వచ్చి, తన ఇలా విలువైన వస్తువులు పొగొట్టుకోవడంపై నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఊర్వశి క్రికెట్‌ ఫ్యాన్‌ ఇప్పుడనే కాదు, గతంలో కూడా చాలా సార్లు స్టేడియానికి వచ్చి టీమిండియా క్రికెటర్లను ఎంకరేజ్‌ చేసింది.

కాగా, ఊర్వశికి టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కి మధ్య ప్రేమాయణం సాగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం, ఇద్దరు సోషల్‌ మీడియా వేదికగా ఒకరినొకరు నిందిచుకోవడం కూడా చేసుకున్నారు. పంత్‌ తనను కలిసేందుకు ఓ సారి హోటల్‌కి కూడా వచ్చాడని, చాలా సేపు తన కోసం వెయిట్‌ చేసి వెళ్లిపోయాడంటూ ఊర్వశి ఓ సారి బాంబు పేల్చింది. దీనికి పంత్‌ స్పందిస్తూ.. కొంతమంది ఫేమస్‌ అవ్వడానికి తన పేరును వాడుకుంటున్నారంటూ పరోక్షంగా ఊర్వశికి చురకలు అంటించాడు. అయితే.. ఆ తర్వాత పంత్‌కు యాక్సిడెంట్‌ కావడం, టీమ్‌కు దూరం కావడంతో.. వారిద్దరి మధ్య వివాదం కూడా సమసిపోయింది. మరి ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూసేందుకని వచ్చి, ఊర్వశి బంగారం, ఫోన్‌ పొగొట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

ఇదీ చదవండి: World Cup: ఇండియాపై పాక్‌ ఓటమి తర్వాత.. షోయబ్‌ అక్తర్‌ షాకింగ్‌ కామెంట్స్‌