iDreamPost

UPI Payments: గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి మీ అకౌంట్ నుంచి..

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు యూపీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా గరిష్టంగా ఒక్క రోజుకు రూ. లక్ష మాత్రమే పంపించే వీలుండేది. ఈ లిమిట్ ను తాజాగా పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు యూపీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా గరిష్టంగా ఒక్క రోజుకు రూ. లక్ష మాత్రమే పంపించే వీలుండేది. ఈ లిమిట్ ను తాజాగా పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

UPI Payments: గూగుల్ పే, ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఒకేసారి మీ అకౌంట్ నుంచి..

ప్రస్తుత ఆధునిక యుగంలో టెక్నాలజీ రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. అరచేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు.. ఎలాంటి పనైనా క్షణాల్లో చేసుకోవచ్చు. ఇక మార్కెట్ లోకి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) అనే డిజిటల్ పేమెంట్ ఎప్పుడైతే వచ్చిందో.. అప్పటి నుంచి బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు ప్రారంభం అయ్యాయి. తాజాగా యూపీఐ చెల్లింపుల్లో మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నిత్యం యూపీఐ ద్వారా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. కాగా.. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా గరిష్టంగా రూ. లక్ష వరకు మాత్రమే రోజులో పంపించే వీలుండేది. తాజాగా ఈ చెల్లింపుల విలువను పెంచినట్లు ఆర్బీఐ వెల్లడించింది.

గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు యూపీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు యూపీఐ ద్వారా గరిష్టంగా ఒక్క రోజుకు రూ. లక్ష మాత్రమే పంపించే వీలుండేది. ఈ లిమిట్ ను తాజాగా పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విద్యా సంస్థలు, హాస్పిటల్స్ కు యూపీఐ పేమెంట్స్ ద్వారా ఒక్క రోజులో రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించుకునేందుకు వీలు కల్పించింది. అయితే ఈ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇందుకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే 5 లక్షల లిమిట్ ను జనవరి 10 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని తమ పార్ట్ నర్లను ఎన్పీసీఐ ఆదేశించినట్లు బిజినెస్ స్టాండర్డ్స్ నివేదించింది. ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో మాత్రమే ఈ లిమిట్ వర్తిస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొడైడర్లు, యూపీఐ యాప్స్ వంటి వాటికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. లిమిట్ పెంచిన రెండు రంగాల్లో పేమెంట్స్ గనణీయంగా పెరిగాయి.. దీంతోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక జనవరి 10 నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని, ఇందులో ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే 5 లక్షల వరకు లిమిట్ పెంచడం అనేది వెరిఫైడ్ మర్చంట్స్ కి మాత్రమే వర్తిస్తుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత సంస్థలకు సర్య్కూలర్ జారీ చేసింది. అందుకు తగిన మార్పులను చేసుకోవాలని పేర్కొంది. మరి లిమిట్ పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి