iDreamPost

జూన్ రెండో వారం – భారీగా OTT వినోదం

జూన్ రెండో వారం – భారీగా OTT వినోదం

ఓటిటి ఫ్యాన్స్ కోసం ఈ వారం వినోదం భారీగా ఉండబోతోంది. థియేటర్లలో విడుదలవుతున్న విరాటపర్వం, గాడ్సేలతో పాటు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో వస్తున్న ఎంటర్ టైన్మెంట్ రెడీ అవుతోంది. అవేంటో చూద్దాం. రేపు ప్రైమ్ లో యాంకర్ సుమ నటించిన ‘జయమ్మ పంచాయితీ’ స్ట్రీమింగ్ కానుంది. జనం హాలు దాకా వెళ్లి చూడకపోవడంతో ఫ్లాప్ అయ్యింది కానీ స్మార్ట్ స్క్రీన్ మీద బాగా రీచ్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది. 17న వచ్చే వాటిలో ఎక్కువ ఆసక్తి రేపుతున్నది నయనతార ‘ఓ2’. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతున్న ఈ థ్రిల్లర్ కం ఎమోషనల్ డ్రామా మీద అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు.తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో రానుంది.

సినిమా స్థాయిలో ప్రమోషన్ చేస్తున్న వెబ్ సిరీస్ ‘సుడల్’ అదే రోజు వస్తోంది. విక్రమ్ వేదా లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఇచ్చిన దర్శక జంట పుష్కర్ గాయత్రీలు రచన చేసిన ఈ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, పార్తీబన్ లాంటి క్యాస్టింగ్ ఉన్నారు. తప్పిపోయిన చెల్లి కోసం అక్క చేసే పోరాటంలో విస్తుపోయే నిజాలు బయటపడతాయి. అదే సుడల్ లో మెయిన్ పాయింట్ ఆసక్తి రేపుతున్న మరో సిరీస్ జీ5లో వస్తున్న ‘రెక్కె’. ట్రైలర్ కట్ అంచనాలు పెంచింది. జంట హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్ కు ఎదురైన సంఘటనల సమూహారం ఇది. శ్రీరామ్, శివబాలాజీ,ధన్య బాలకృష్ణ, శరణ్య ప్రదీప్ లాంటి తారాగణం ఉన్నారు. దర్శకుడు పోలూరు కృష్ణ.

అదే 17నే జీ5లో ‘ఫింగర్ టిప్’ సీజన్ 2 రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ మూవీ ‘ఆపరేషన్ రోమియో’ వస్తోంది. ఇప్పటిదాకా పే పర్ వ్యూ మోడల్ లోనే ఉన్న ‘స్పైడర్ మ్యాన్ నో వే హోమ్’ ని ఇదే ప్లాట్ ఫార్మ్ లో ఉచితంగా ఇవ్వబోతున్నారు. జీ5లో ‘ఇన్ఫినిటీ స్ట్రాం’ రిలీజవుతోంది. మొత్తానికి ఇంతేసి కంటెంట్ వస్తే ఆడియన్స్ ఏది చూడాలో ఏది వదిలేయాలో అర్థం కాని అయోమయంలో చిక్కుకోవడం ఖాయం. అందుకే ఓటిటిలు కూడా ఈ పోటీకి తగ్గట్టే పబ్లిసిటీలు చేస్తున్నాయి. అయినా ప్రతిదీ శుక్రవారమే రిలీజ్ చేయాలన్న సెంటిమెంట్ కాస్త పక్కనపెడితే మిగిలిన రోజుల్లోనూ ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆలోచిస్తే బెటర్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి