iDreamPost

అత్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మహిళలు కూడా బిజీగా మారిపోతున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు ఆయన భార్య మరో వ్యాపార రంగంలోకి రాబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మహిళలు కూడా బిజీగా మారిపోతున్నారు. ఇప్పటికే ఆయన పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు ఆయన భార్య మరో వ్యాపార రంగంలోకి రాబోతున్నారు.

అత్తతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని ఇండస్ట్రీ లేదు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపు గానూ దేశంలో రెండవ అత్యంత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండే ఇప్పుడు ఆయన సతీమణి సురేఖ.. కొత్త మార్గంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆమె వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. అందుకు మద్దతుగా నిలిచారు ఆమె కోడలు ఉపాసన.

ప్రస్తుతం మార్కెట్‌లో మంచి వ్యాపారంగా మారింది ఫుడ్ బిజినెస్. పచ్చళ్లు, ఇన్ స్టెంట్ ఫుడ్ పౌడర్స్, రెడీమేడ్ చపాతి, చివరకు వేయించిన ఉల్లిపాయలు కూడా లభిస్తున్నాయి. వంట చేసుకునేందుకు సమయం లేని వాళ్లు, వంట రాని వాళ్లకు ఇలాంటి ప్రొడక్ట్స్ వరంగా మారింది. రైస్ వండుకుంటే.. వీటిని తెచ్చుకుని.. చిన్న చిన్న వంటలతో సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి వారినే దృష్టిలో పెట్టుకుని సరికొత్త వ్యాపారన్ని ప్రారంభించారు సురేఖ అండ్ ఉపాసన. ’అత్తమ్మాస్ కిచెన్‘ అనే పేరుతో ఫుడ్ బిజినెస్ షురూ చేశారు.

ఉపాసన నేతృత్వంలో సురేఖ ఈ కొత్త బిజినెస్ స్టార్ అయ్యింది. సంప్రదాయ వంటకాలను రెడీ మిక్స్ రూపంలో అందిస్తున్నారు. ఉప్మా, పొంగల్, పులిహోర, రసం ఇన్ స్టెంట్ మిక్స్ ప్యాకెట్లను అందుబాటులో లభిస్తున్నాయి. కాగా, గతంలో చిరంజీవి తన భార్య చేసే రసం ఎంతో ఇష్టం కాగా, ఇప్పుడు ఆ ఫ్లేవర్.. భోజన ప్రియులకు కూడా లభించనుంది. దీంతో కమ్మనైన రసం ఇన్ స్టెంట్ పౌడర్ రూపంలో అందుబాటులోకి వచ్చేసింది.  తెలుగు సంప్రదాయాల్లో భాగంగా మరిన్ని వంటకాల రెసిపీలను త్వరలో అందించనున్నారు. చిటికెల్ వంట అయిపోవాలి అనుకుంటే.. వీటిని తెచ్చుకుని.. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని కడుపు నిండా భోజనం చేయొచ్చు. మరెందుకు ఆలస్యం ఎలా రుచి చూసి.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి