iDreamPost

టెన్త్ టాపర్ ముఖంపై ట్రోల్స్.. ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పిన అమ్మాయి

సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసిన ట్రోలర్స్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన టెన్త్ టాపర్ గట్టిగా బుద్ది చెప్పింది. ఆమె ముఖంపై అవాంఛిత రోమాల కారణంగా ట్రోలర్స్ తమ నీచ బుద్దిని బయటపెట్టారు.

సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేసిన ట్రోలర్స్ కు ఉత్తరప్రదేశ్ కు చెందిన టెన్త్ టాపర్ గట్టిగా బుద్ది చెప్పింది. ఆమె ముఖంపై అవాంఛిత రోమాల కారణంగా ట్రోలర్స్ తమ నీచ బుద్దిని బయటపెట్టారు.

టెన్త్ టాపర్ ముఖంపై ట్రోల్స్.. ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పిన అమ్మాయి

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సమాజం పోకడ మారిపోయింది. సామాజిక మాధ్యమాల ద్వారా మంచి ఎంతుందో చెడు కూడా అంతే స్థాయిలో ఉంది. కొంత మందికి ఉపాధి మార్గంగా, మరికొంత మందికి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తుంది. ఇదే సమయంలో కొంత మందికి ఆకతాయిలకు అడ్డగా కూడా మారింది. మహిళలపై అసభ్యంగా పోస్టులు పెట్టడం.. వారి అందంపై ట్రోల్స్ చేయడం ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లో ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభకనబర్చి స్టేట్ టాపర్ గా నిలిచింది. అయితే ఆ విద్యార్థిని ముఖంపై అవాంఛిత రోమాలు ఉండడంతో కొంతమంది ఆమెపై ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇక తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఆ విద్యార్థిని ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పింది.

ఉత్తర ప్రదేశ్ కి చెందిన ప్రాచీ నిగమ్ అనే పదో తరగతి విద్యార్థిని ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. ఆమె స్టేట్ టాపర్ గా నిలిచింది. సీతాపూర్ కి చెందిన ప్రాచీ నిగమ్ 600 మార్కులకు గానూ.. 591 మార్కులు సాధించి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. కాగా నేటి యువతకు రోల్ మోడల్ గా మారిన ఆ విద్యార్థినిపై ట్రోలింగ్ కు దిగారు కొందరు వ్యక్తులు. ఆమె ముఖంపై అవాంఛిత రోమాలు ఉండడంతో ఆమె ఫొటోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తమ వక్రబుద్దిని చాటుకున్నారు. ఇదే సమయంలో ప్రాచీకి ఎనలేని మద్దతు లభించింది. ఇక ఈ అమ్మాయి ఇప్పుడు ట్రోలర్స్ కు చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పింది.

తన ముఖంపై నీచంగా ట్రోల్స్ చేస్తున్న వారికి బాలిక ప్రాచీ నిగమ్ బుద్ది చెప్పారు. ట్రోలింగ్ పై హూందాగా స్పందించారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు ఇలా ఎవరూ నా ముఖంపై కామెంట్స్ చేయలేదు. ఉత్తరప్రదేశ్ లో టెన్త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాక నా ఫొటో చూసి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. వాటన్నింటినీ పట్టించుకోను. అవాంఛిత రోమాల గురించి ఆలోచించట్లేదు. మార్కులే ముఖ్యం నాకు.. ఇంజినీర్ కావడమే నా లక్ష్యం అని నిగమ్ తెలిపారు. ఇక ప్రాచీ నిగమ్ కు మద్దతు తెలిపే వాళ్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆమెను ట్రోల్ చేసే వారికి సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి