iDreamPost

Unstoppable With NBK : అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య

Unstoppable With NBK : అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన సెలబ్రిటీ టాక్ షో ఆన్ స్టాపబుల్ తెలుగులో హయ్యెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న ఓటిటి ప్రోగ్రాంగా కొత్త రికార్డులు సృష్టించింది. 40 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసి టాప్ వన్ ప్లేస్ లో కూర్చుండిపోయింది. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. సీజన్ 2 కూడా ఉంటుందని కాకపోతే కొంచెం గ్యాప్ తర్వాత మే లేదా జూన్ నుంచి మొదలయ్యేలా ప్లానింగ్ జరుగుతున్నట్టుగా తెలిసింది. ఈసారి వచ్చే ప్రముఖులను లిస్టు చేసే పనిలో ఆల్రెడీ టీమ్ బిజీగా ఉన్నట్టు సమాచారం. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్లను తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు వేస్తున్నారు.

నిజానికి ఈ షో ముందు ప్రకటించినప్పుడు సవాలక్ష అనుమానాలు వచ్చాయి. స్క్రీన్ మీద అదరగొట్టే బాలయ్య బయట కొంచెం తడబడటం చాలా సార్లు చూశాం. అలాంటిది యాంకర్ గా ఏ మేరకు మెప్పిస్తారనే సందేహం రావడం సహజం. కానీ బాలకృష్ణ వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ అంచనాలకు మించిన అవుట్ ఫుట్ ని ఇచ్చారు. తెరవెనుక ప్రోగ్రాం డిజైన్ చేసినవాళ్ల ప్రతిభ ఎంతైనా ఉండొచ్చు కానీ ఫైనల్ గా పండించాల్సింది బాలయ్యే. ఆ విషయంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారు. మొత్తం 10 ఎపిసోడ్లను నడిపించిన తీరు ఆహాకు సబ్స్క్రైబర్స్ ని పెంచిన మాట వాస్తవం. అంతగా ప్రభావం చూపించింది.

ఈ షో విజయవంతం కావడంలో బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, వచ్చినవాళ్లతో సహజంగా కలిసి పోయిన తీరు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. రెగ్యులర్ యాంకరింగ్ కి భిన్నంగా చాలా సరదాగా తన స్టార్ డంని మర్చిపోయి మరీ నవ్వించి మెప్పించిన తీరు సూపర్ హిట్ చేసింది. అఖండ, పుష్ప, లైగర్ టీమ్స్ వాళ్ళ సినిమాల ప్రమోషన్ల కోసం వచ్చినప్పటికీ అది గుర్తు రానంత మంచి టైమింగ్ తో కూడిన ప్రశ్నలతో సక్సెస్ చేయడం షోని నిలబెట్టింది. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, నాని, బ్రహ్మానందం, రానా, రాజమౌళి, కీరవాణి, రవితేజ, అనిల్ రావిపూడి, సుకుమార్, మంచు కుటుంబం ఇప్పటిదాకా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న సెలబ్రిటీలు

Also Read : Acharya & Vikram : చిరు ప్లానింగ్ కి కమల్ బ్రేక్ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి