iDreamPost

తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. విజృంభించిన ఉమేష్ యాదవ్..

  • Author Soma Sekhar Published - 07:49 AM, Thu - 21 September 23
  • Author Soma Sekhar Published - 07:49 AM, Thu - 21 September 23
తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. విజృంభించిన ఉమేష్ యాదవ్..

ఇటు వరల్డ్ కప్ జట్టులో, అటు మిగతా సిరీస్ ల్లో స్థానం సంపాదించని పలువురు ఆటగాళ్లు ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో ఆడుతున్న సంగతి తెసింది. కాగా.. టీమిండియా క్రికెటర్లు కౌంటీ ఛాంపియన్ షిప్ లో చెలరేగిపోతున్నారు. మెున్న చాహల్, ఉనద్కత్ తమ బౌలింగ్ తో మెరుపులు మెరిపిస్తే.. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్ బ్యాటింగ్ లో విజృంభించాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడూ బంతితో రాణించే ఉమేష్ యాదవ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-1 పోటీల్లో భాగంగా హ్యాంప్ షైర్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాట్ తో చెలరేగిపోయాడు.

టీమిండియా క్రికెటర్లు ఇంగ్లాండ్ లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్ డివిజన్-1 పోటీల్లో సత్తా చాటుతున్నారు. మెున్న చాహల్, ఉనద్కత్ లు తమ అద్భుత బౌలింగ్ తో సత్తా చాటగా.. తాజాగా టీమిండియా వెటరన్ పేసర్ ఉమేష్ యాదవ్ బ్యాట్ తో చెలరేగిపోయాడు. కౌంటీ ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్ లో హ్యాంప్ షైర్ తో మ్యాచ్ లో ఎసెక్స్ తరపున 9వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు.

కాగా.. ఎప్పుడూ బంతితో రాణించే ఉమేష్ తాజాగా బ్యాట్ తో విజృంభించాడు. దీంతో ఎసెక్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 447 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. జట్టులో కెప్టెన్ టామ్ వెస్లీ(50), సైమర్ హార్పర్(62), ఆడమ్ రోస్సింగ్టన్(104), మాథ్యూ క్రిచ్లీ(99) పరుగులతో రాణించారు. మరి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి చెలరేగిన ఉమేష్ యాదవ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి