iDreamPost

SRH vs KKR: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. రాహుల్ త్రిపాఠి రనౌట్ లో తప్పు ఎవరిది?

KKR vs SRH మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి రనౌట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అయితే ఈ రనౌట్ లో తప్పు త్రిపాఠిదా? లేక అబ్దుల్ సమద్ దా? ఓసారి పరిశీలిద్దాం పదండి.

KKR vs SRH మ్యాచ్ లో హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి రనౌట్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. అయితే ఈ రనౌట్ లో తప్పు త్రిపాఠిదా? లేక అబ్దుల్ సమద్ దా? ఓసారి పరిశీలిద్దాం పదండి.

SRH vs KKR: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. రాహుల్ త్రిపాఠి రనౌట్ లో తప్పు ఎవరిది?

కోల్ కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ 8 వికెట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఒక దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ పటిష్ట స్థితిలో నిలిచింది, భారీ స్కోర్ సాధించే ఊపులో ఉంది. ఇలాంటి టైమ్ లో కేకేఆర్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్న రాహుల్ త్రిపాఠి రనౌట్ గా వెనుదిరిగాడు. ఇదే మ్యాచ్ ను మలుపుతిప్పింది. అయితే ఈ రనౌట్ విషయంలో అబ్దుల్ సమద్-త్రిపాఠిలో తప్పు ఎవరిది? ఓసారి పరిశీలిద్దాం.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో 39 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సన్ రైజర్స్ టీమ్. ఇలాంటి టైమ్ లో హెన్రిచ్ క్లాసెన్(32)తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు రాహుల్ త్రిపాఠి. క్లాసెన్ ఔటైన తర్వాత అబ్దుల్ సమద్ క్రీజ్ లోకి వచ్చాడు. సమద్ సైతం దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. దాంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయడం ఖాయంగా కనిపించింది. కానీ అనూహ్యంగా సునీల్ నరైన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అబ్దుల్ సమద్ వేసిన 2వ బంతిని హాఫ్ సైడ్ షాట్ ఆడగా.. ఆండ్రీ రస్సెల్ డైవ్ చేసి బాల్ ను ఆపాడు. అయితే అప్పటికే సమద్ పరుగు కోసం వస్తున్నాడు. కానీ రాహుల్ త్రిపాఠి మాత్రం మధ్యలోకి వచ్చి అలాగే ఆగిపోయాడు. దాంతో రనౌట్ గా వెనుదిరగాల్సి వచ్చింది.

అయితే ఈ రనౌట్ లో తప్పు రాహుల్ త్రిపాఠిదే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమద్ ను చూసి రాహుల్ పరిగెత్తాల్సింది కానీ.. మధ్యలోనే ఆగిపోయి ఔట్ అయ్యాడు. లేకుంటే కచ్చితంగా రన్ వచ్చేదే అంటూ చెప్పుకొస్తున్నారు. రాహుల్ అవుట్ కాకుంటే.. అతడున్న టచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసుండేదే. కేవలం రాహుల్ తప్పు కారణంగానే అతడు పెవిలియన్ చేరాడని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిపాఠి అవుటైన తర్వాత SRH వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. దాంతో కేవలం 159 పరుగులకే రనౌట్ అయ్యింది. మరి ఈ రనౌట్ విషయంలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి