iDreamPost

తిరుమల నడకదారి భక్తులకి కర్ర ఇవ్వడానికి కారణం? ఇంత అర్ధం ఉందా?

తిరుమల నడకదారి భక్తులకి కర్ర ఇవ్వడానికి కారణం? ఇంత అర్ధం ఉందా?

ఇటీవల తిరుమల నడక దారిలో లక్షిత అనే చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మృతి చెందిన బాలిక కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అటవీశాఖ సైతం ఆ బాలిక కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ ఘటనపై టీటీడీ వెంటనే అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత చిన్న పిల్లలకు నో ఎంట్రి అంటూ షరతులు విధించింది. దీంతో పాటు నకడమార్గంలో చిన్న పిల్లలతో కలిసి వెళ్లాలనుకునే వారికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే  అనుమతి ఇచ్చింది.

అయితే ఈ నేపథ్యంలోనే టీటీడీ అటవీ శాఖ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఇందులో భక్తుల రక్షణ కోసం అటవీ చట్టాలను పరిగణలోకి తీసుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఒక చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తుల రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాల్లో అస్సలు రాజీపడే ప్రసక్తి లేదని తెలిపారు. అయితే భక్తులకు చేతి కర్ర ఇవ్వడం అనే టీటీడీ నిర్ణయంపై కొంతమంది నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చేతి కర్ర ఇవ్వడం ఏంటని కాస్త చులకనగా మాట్లాడుతున్నారు. కానీ.., దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది.

tirumala

తిరుమల నడకదారి భక్తులకి కర్ర ఇవ్వడానికి కారణం?

అప్పుడప్పుడు కొన్ని రకాల వన్య ప్రాణులు ఒంటరిగా కనిపించిన మనుషులపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. మరీ ముఖ్యంగా చిరుతలు, పెద్ద పులుల దాడి చాలా వైరుద్యంగా ఉంటుంది. ఇవి ఒక జీవిని వేటాడాలంటే తమ శక్తితో పాటు ఎత్తుని కూడా లెక్కేసుకుంటాయి. తలపైకి ఎత్తి చూసేంత ఎత్తు ఉన్న ప్రాణుల జోలికి పులులు అంత త్వరగా రావు. తమకన్నా చిన్నగా ఉన్న ప్రాణాలను వేటాడటానికి ఇష్టపడుతాయి. ఇక.. మనిషి తన తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఎంత పైకి ఎత్తితే.. ఆ మొత్తాన్ని మనిషి హైట్ గా పులులు భావిస్తాయి. అలాంటి సమయంలో అంత దైర్యంగా ముందుకి రావడానికి సాహసించవు. ఇది అటవీ అధికారులు చెప్పే మాట.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే టీటీడీ భక్తుల చేతికి కర్రలు అందజేసింది. పైగా.. ఒకేసారి 100 మంది చేతుల్లో ఇలా కర్రలు ఉంటే ఆత్మ రక్షణగా కూడా ఉపయోగపడుతాయి. ఇక.. ఈ చేతి కర్రల నిర్ణయం ఇప్పటి పరిస్థితిని దాటడానికి తీసుకుందే తప్ప, ఇదే శాశ్విత పరిష్కారం అని టీటీడీ ఎక్కడా స్పష్టం చేయలేదు. అటవీ చట్టాలను అనుసరించి.. ఇక్కడ కంచె ఏర్పాటు చేయొచ్చా? లేదా అన్నది చూడాలి. పైగా.. ఇప్పటికే సీసీటీవీలు పెంచారు. భక్తుల రక్షణ కోసం బందోబస్త్ పెంచారు. భక్తులకు తగిన సూచనలు కూడా చేస్తున్నారు. ఓ కష్ట సమయంలో నిబద్దతతో కష్టపడుతున్న వారిపై.. నిజాలు తెలుసుకోకుండా ఇలా నిందలు వేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: భక్తుల భద్రతే తమకు ముఖ్యం అంటున్న TTD ఛైర్మన్ భూమన!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి