iDreamPost

టీటీడీకి భారీ విరాళం.. బాబోయ్ అన్ని కోట్ల రూపాయలా!

టీటీడీకి భారీ విరాళం.. బాబోయ్ అన్ని కోట్ల రూపాయలా!

దేశంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతికి ప్రతిరోజూ భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయాని భక్తుల నమ్మకం. ‘నమో వేంకటేశాయ’ అంటూ నామ జపంతో ప్రతిరోజూ తిరుమల వీధులన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి. ప్రపంచంలోనే ప్రసిద్ద హిందుత్వ దైవిక క్షేత్రంగా తిరుమల తిరుపతి విరాజిల్లుతుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ స్థోమతకు తగ్గట్టుగా దేవదేవుడికి ముడుపుల రూపంలో చెల్లించుకుంటారు. స్వామివారికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. తాజాగా శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందు కు ఓ దాత భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారని టీటీడీ ఈవో తెలిపారు. వివరాల్లోకి వెళితే..

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తమకు తోచినంత డబ్బురూపంలో కానీ, బంగారం, వెండి రూపంలో కాని హుండీలో వేస్తుంటారు. కొంతమంది దాతలు భారీగా విరాళాలు అందిస్తారు. అలా కలియుగ ప్రత్యక్షదైవం అయిన తిరుమలేశుడిపై వారికి ఉన్న భక్తిని చాటుకుంటారు. తాజాగా నవీ ముంబైలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుపతిలో సింఘానియా గ్రూప్ తో టీటీడీ ఎంవోయు ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. తిరుమల తిరుపతిలోని అన్నమయ్య భవన్ లో టీటీటీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

మహరాష్ట్ర ప్రభుత్వం ముంబాయిలో ఉన్న ఉల్వే ప్రాంతంలో ఈ ఆలయ నిర్మాణం కోసం పది ఏకరాల భూమిని కేటాయించిందని.. అక్కడ రూ.70 కోట్లతో తిరుమలేశుడి ఆలయాన్ని అత్యద్బుతంగా నిర్మించేందుకు దాత ముందుకు వచ్చారని ఈ సందర్భంగా టీటీడీ ఈవో తెలిపారు. త్వరలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ హరి సింఘానియా వేద పండితులు ఆశీర్వదించి.. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి