iDreamPost
android-app
ios-app

10th చదివిన కుర్రాడు ITలో అద్భుతం! రూ.400 కోట్లకి అధిపతి అయ్యాడు!

ప్రతి వ్యక్తి జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది విద్య మాత్రమే. అయితే ఓ యువకుడు కేవలం టెన్త్ చదివి ఎలాంటి డిగ్రీ పట్టా లేకుండానే ఐటీ రంగంలో అద్భుతం చేశాడు. ఏకంగా 400 కోట్టు సంపాదించాడు.

ప్రతి వ్యక్తి జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది విద్య మాత్రమే. అయితే ఓ యువకుడు కేవలం టెన్త్ చదివి ఎలాంటి డిగ్రీ పట్టా లేకుండానే ఐటీ రంగంలో అద్భుతం చేశాడు. ఏకంగా 400 కోట్టు సంపాదించాడు.

10th చదివిన కుర్రాడు ITలో అద్భుతం! రూ.400 కోట్లకి అధిపతి అయ్యాడు!

ప్రస్తుత రోజుల్లో యూత్ అంతా ఇంజనీరింగ్ విద్య వైపు మొగ్గుచూపుతున్నారు. బీటెక్ వంటి కోర్సులు చేస్తే చదువు పూర్తి కాకముందే క్యాంపస్ ప్లేస్ మెంట్లలో లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందొచ్చని భావిస్తుంటారు. ఐఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో అడ్మిషన్లకోసం పరుగులు తీస్తున్నారు. ఇదే సమయంలో మరికొంత మంది యువత ఐఐటీ, ఐఐఐటీ, ఐఐఎం వంటి ఎడ్యుకేషన్ ఇన్సిట్యూట్ లలో చదవకపోయినా కోట్లు సంపాదిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్ధి మహా అయితే మంచి కంపెనీలో జాబ్ వస్తే ఏడాదికి ఓ కోటిరూపాయలు సంపాదించగలడేమో. కానీ ఓ యువకుడు ఎలాంటి డిగ్రీ పట్టాలు లేకుండా ఐటీ రంగంలో 400 కోట్లు సంపాదించి సరికొత్త హిస్టరీ సృష్టించాడు. ఐటీలో రాణిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

టాలెంట్ ఎవరీ సొత్తు కాదు. నేటి రోజుల్లో టాలెంటే బిగ్గేస్ట్ ఇన్వెస్ట్ మెంట్. తమలో ఉన్న ప్రతిభకు కాస్త వినూత్నమైన ఆలోచనలను జోడిస్తే చాలు అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నారు నేటి యువత. కోట్ల సంపాదన సృష్టించేందుకు డిగ్రీలే అవసరం లేదు.. టాలెంట్ ఉంటే సంపాదించేందుకు హద్దే లేదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో అస్సాంకు చెందిన ఓ యువకుడు ఎలాంటి డిగ్రీ పట్టా లేకున్నా కూడా ఐటీ రంగాన్ని ఏలుతున్నాడు. తన వినూత్నమైన ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తూ కోట్లకు అధిపతి అయ్యాడు. అతడు మరెవరో కాదు అస్సాంకు చెందిన కిషన్ బగారియా. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసింది. అనేక సోషల్ మీడియా యాప్స్ తో ప్రపంచంతో కనెక్ట్ అవుతున్నారు యూజర్లు.

Kishan Bairaa

ఈ నేపథ్యంలో కిషన్ బగారియా యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండే విధంగా మెసేజింగ్ యాప్స్ అన్నీ ఒకే చోట ఓపెన్ అయితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా టెక్ట్స్.కామ్ అనే వెబ్ సైట్ ను రూపొందించారు. వర్డ్ ప్రెస్. కామ్ అధినేత మ్యాట్ కు ఈ వెబ్ సైట్ నచ్చడంతో ఏకంగా రూ. 400 కోట్లకు కొనుగోలు చేశారు. అంతే కాదు ఆ విభాగానికి కిషన్ నే హెడ్ గా నియమించారు. అయితే కిషన్ బగారియా ఇంతటి విజయం సాధించడానికి ఆన్ లైన్ కోర్సులపై పట్టుసాధించడమే. టెన్త్ వరకే చదువుకున్న అతడు ఏడో తరగతి నుంచే ఆన్ లైన్ కోర్సులపై దృష్టిపెట్టాడు. స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఏకంగా టెక్ట్స్.కామ్ అనే వెబ్ సైట్ ను రూపొందించారు. ఈ వెబ్ సైట్ నేడు కిషన్ ను 400 కోట్లు సంపాదించేలా చేసింది. ఐటీ రంగంలో రాణించడానికి డిగ్రీ పట్టాలతో పనిలేదని నిరూపించాడు కిషన్ బగారియా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి