iDreamPost

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌!

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై ఆ సమస్యకు చెక్‌!

చిల్లర విషయంలో ప్రయాణికులతో పాటు.. కండెక్టర్లకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలకు బ్రేక్‌ పడనుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. గతేడాది చివర్లోనే ఈ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావించింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. క్యూఆర్ కోడ్‌ అమలు విషయంలో కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తాయి. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ప్రయాణికులు కొన్న టికెట్‌ డబ్బులు ఎవరి ఖాతాలోకి వెళతాయి? ఒక వేళ ఆ డబ్బులు జమకాకపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వంటి ప్రశ్నలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సమస్యలను అదిగమించేందుకు టీఎస్‌ఆర్టీసీ ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తేవాలని భావించింది. ఆ సాఫ్ట్‌వేర్‌ను సిటీలోని బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఆ సాఫ్ట్‌వేర్‌ గనుక విజయవతంగా పని చేస్తే.. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులో నగదు రహిత టికెట్‌ అందుబాటులోకి రానుంది. కాగా, హైదరాబాద్‌ బస్సుల్లో టీ-24, టీ-6, ఎఫ్‌-24 టికెట్ల విధానం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

ఆర్టీసీ ఈ విధానాన్ని కొన్ని నెలల క్రితమే పల్లెవెలుగు బస్సుల్లో కూడా అందుబాటులోకి తెచ్చింది. టీ-9 టికెట్లను విక్రయిస్తోంది. ఈ టికెట్‌ ధర 100 రూపాయలుగా ఉంది. ఈ టికెట్‌ ద్వారా దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలు సాగించవచ్చు. ఈ టికెట్లను కండెక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జారీ చేస్తారు. ప్రయాణికులకు ఈ టికెట్‌ వల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి. మరి, టీఎస్‌ఆర్టీసీ త్వరలో అందుబాటులోకి తేనున్న క్యూఆర్‌ కోడ్‌ విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి