iDreamPost

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

తెలంగాణ మంత్రి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు. వేముల మంజులమ్మ హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మంత్రి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా కొంత కాలం నుంచి వేముల మంజులమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలిపారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మరణ వార్త తెలియగానే సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వేముల మంజులమ్మ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరారు. బీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు, నాయకలు మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో రేపు ఉదయం వేముల మంజులమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి