iDreamPost

కేసీఆర్ భగవంతుడి స్వరూపం.. మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు

కేసీఆర్ భగవంతుడి స్వరూపం.. మంత్రి మల్లారెడ్డి ప్రశంసలు

మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత,  తెలంగాణ రాష్ట్ర కార్మిక మంత్రి సి.మల్లారెడ్డి గురించి తెలియని వారు ఉండరు. ఈయనకు సినిమా హీరోలకు ఉన్న రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఏమిటిలో మాట్లాడిన విజిల్స్  ఓ రేంజ్ లో ఉంటాయి. ఆయన చెప్పే డైలాగ్స్ కి యువత  ఫుల్ జోష్ లో మునిగిపోతుంది. ఆయన మాట్లాడే స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది. అలానే రాజకీయాల్లోనూ మంత్రి మల్లారెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తుంటారు. తాజాగా కేసీఆర్ ను భగవంతుడి స్వరూపం అంటూ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.

టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే అసెంబ్లి సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలానే  కేసీఆర్ పటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ విలీనంపై  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా స్పందించారు.  ఆర్టీసీ ఉద్యోగులకు డబుల్ కా మీటా ఇచ్చామని,  కనీసం వారు ఊహించని విధంగా అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ చేశారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులు  కూడా మన బిడ్డలే, మన కార్మికులే అని చెప్పి.. మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో పెద్ద ఎత్తున డబుల్ కా మీటా ఇచ్చినామని మల్లారెడ్డి అన్నారు. తాము ఇలా ప్రభుత్వ ఉద్యోగులు అవుతామని ఆర్టీసీ కార్మికులు కలలో కూడా ఊహించి ఉండరని, ఎప్పటికీ ఆర్టీసీలోనే ఉంటమని  అనుకున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అయితే ఈ రోజు ఆర్టీసీ కార్మికులందరిని ప్రభుత్వ ఉద్యోగులకు ధీటుగా ప్రభుత్వంలో కలుపుకున్నామని, సీఎం కేసీఆర్ మహాత్ముడు, ఆయన భగవంతుడి స్వరూపమంటూ సీఎం కేసీఆర్ పై మంత్రి ప్రశంల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ ఏది చేసిన గొప్పని చేస్తాడని, ఆయన మాదిరి ఎవ్వరు పని చేయలేరని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మరి..  ఈ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి