iDreamPost

జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు!

జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు!

జేసీ ప్రభాకర్ రెడ్డి..  రాజకీయాలపై అవగాహన  ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.  అనంతపురం జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంటారు.  ఈయనకు సంబంధించిన దివాకర్ ట్రావెల్స్ పై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బీఎస్3 వాహనాలను ..బిఎస్4 గా మార్చి నడుపుతున్నారని అభియోలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో జేసి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్ బీఎస్3 వాహనాలను బీఎస్4గా మార్చి నడుపుతున్నారని అభియోగాలకు గాను ఈ పరిణామం చోటు చేసుకుంది. అలానే నెలలోగా కౌంటర్ దాఖలు చేయాలని జేసీని నోటిసుల్లో హైకోర్టు ఆదేశించింది. దివాకర్ ట్రావెల్స్ ఇలా వాహనాలను మార్చి నడుపుతున్నట్లు గతంలో అధికారుల తనిఖీలు నిర్ధారణ అయింది.

ఈ క్రమంలో కర్నాటక, ఏపీలో  కేసులు నమోదు చేసి..పలు వాహనాలను సీజ్ చేశారు. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జేసీ ట్రావెల్స్ వ్యవహారాలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.  అలానే ఈ కేసును  సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేశారు. తన పిటిషన్ లో అనేక విషయాలను పేర్కొన్నారు. 2020 అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖ అధికారులను కలిసి.. పలుమార్లు ఫిర్యాదు చేశానని, అయినా చర్యలు తీసుకోలేదని పిటిషన్ లో తెలిపారు.

తెలంగాణాలో మాత్రం జేసీ బస్సులను అకత్రమంగా నడుపుతున్నారని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని ఉన్నత న్యాయస్థానం దృష్టికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో  ఎందుకు విచారణ జరపలేదని హైకోర్టు ప్రశ్నించింది. అలానే కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ.. జీసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రతివాదులైన తెలంగాణ రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి, రవాణ శాఖ కమిషనర్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి,డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. మరి.. దివాకర్ ట్రావెల్స్ విషయంలో తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సీఎం మంచి మనసు..అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు ఆర్థిక సాయం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి