iDreamPost

విద్యార్థులకు అలర్ట్‌.. మరి కొన్ని గంటల్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

  • Published Apr 23, 2024 | 11:51 AMUpdated Apr 24, 2024 | 10:56 AM

TS Inter Results 2024: ఏపీలో పది, ఇంటర్‌ పరీక్షా ఫలితాలు వెల్లడి కాగా.. తెలంగాణ విద్యార్థులు రిజల్ట్స్‌ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ వివరాలు..

మొన్నటి వరకు పరీక్షల సీజన్‌ నడిచింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎగ్జామ్స్‌ గురించి టెన్షన్‌ టెన్షన్‌గా గడిపారు. ఏప్రిల్‌ 1 నాటికి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు రిజల్ట్స్‌ టైమ్‌. ఇప్పటికే ఏపీలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలు వెల్లడి కాగా.. సోమవారం నాడు పదో తరగతి ఎగ్జామ్స్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయి. ఈ పరీక్షల్లో మనస్వి అనే విద్యార్థిని.. 600 మార్కులకు గాను.. ఏకంగా 599 మార్కులు సాధించి.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ రికార్డ్‌ బ్రేకవ్వడం ఇప్పట్లో అసాధ్యం అంటున్నారు. అదలా ఉంచితే ఏపీలో టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయి. మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ సారి ఏపీలో పది, ఇంటర్‌ ఫలితాలు త్వరగా వచ్చేశాయి. ఇక తెలంగాణలో ఇంకా ఫలితాలు వెల్లడి కాలేదు.

ఈ క్రమంలో తాజాగా తెలంగాణ ఇంటర్‌ ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. మరి కొన్ని గంటల్లో తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏప్రిల్‌ 24 అనగా బుధవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ రిజల్ట్స్‌ వెల్లడిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుదల చేస్తారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు https:// tsbie. cgg. gov. in లేదా https:// results. cgg. gov. in వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు.

ఇక తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సుమారు 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,78,527 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో.. త్వరగా ఫలితాలను వెల్లడించాలని విద్యార్థులు కోరుతున్నారు. బోర్డు కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇక ఇంటర్‌ ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే తెలంగాణ పదో తరగతి రిజల్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఈ వారంలోనే పది ఫలితాలు రావొచ్చు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి