iDreamPost
android-app
ios-app

ఇంటర్ విద్యార్థులకు కీలక అప్ డేట్.. ఫలితాలు వచ్చేది అప్పుడే!

  • Published Apr 19, 2024 | 9:00 PM Updated Updated Apr 19, 2024 | 9:00 PM

ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ ఫలితాల ప్రకటనపై కీలక అప్ డేట్ అందించింది. ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే?

ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ ఫలితాల ప్రకటనపై కీలక అప్ డేట్ అందించింది. ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే?

  • Published Apr 19, 2024 | 9:00 PMUpdated Apr 19, 2024 | 9:00 PM
ఇంటర్ విద్యార్థులకు కీలక అప్ డేట్.. ఫలితాలు వచ్చేది అప్పుడే!

ఇంటర్ విద్యార్థులకు పరీక్షల కాలం ముగిసింది. మంచి మార్కులు సాధించేందుకు కష్టపడి చదివి పరీక్షలు రాసిన స్టూడెంట్స్ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేయాలి.. లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలంటే ఏ కోర్స్ బెస్ట్ అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పుడు మిగిలింది రిజల్ట్స్ మాత్రమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ స్టూడెంట్స్ కు ఇంటర్ బోర్డ్ కీలక అప్ డేట్ ఇచ్చింది. ఫలితాలు అప్పుడే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

పరీక్షలు రాసేటపుడు కంటే ఫలితాలు విడుదలయయ్యే రోజే స్కూడెంట్స్ కొంత టెన్షన్ కు గురవుతుంటారు. ఆశించిన మార్కులు వస్తాయో లేదో అని అటు తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళన చెందుతుంటాయి. ఇక లక్షలాదిమంది ఇంటర్ విద్యార్థుల భవితవ్యం త్వరలోనే తేలనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలు వారంరోజుల్లోపే వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తికాగా.. ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 23 లేదా 24న ఫలితాలను వెల్లడించనున్నారు. గతంలో జరిగిన తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒకేసారి ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ అనుమతి తీసుకుని ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో.. 4,78,527 మంది మొద‌టి సంవత్సరం విద్యార్థులు కాగా.. 4,43,993 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet girişjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişholiganbetjojobetjojobet girişjojobetbetcio