iDreamPost

రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత.. ఎన్నికల్లో పోటీ కోసమేనా?

  • Published Oct 22, 2023 | 3:13 PMUpdated Oct 22, 2023 | 3:13 PM

బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి కంటే ముందు మరో నిర్ణయం తీసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మీద సస్పెన్షన్‌ ఎత్తి వేసింది. మరి దీని వెనక కాషాయ పార్టీ వ్యూహం ఏంటి అంటే..

బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి కంటే ముందు మరో నిర్ణయం తీసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ మీద సస్పెన్షన్‌ ఎత్తి వేసింది. మరి దీని వెనక కాషాయ పార్టీ వ్యూహం ఏంటి అంటే..

  • Published Oct 22, 2023 | 3:13 PMUpdated Oct 22, 2023 | 3:13 PM
రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత.. ఎన్నికల్లో పోటీ కోసమేనా?

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి. ఇక ఎన్నికల్లో పోటీ కోసం.. అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు.. అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. ప్రచారం కూడా ప్రారంభించాయి. ఇక బీజేపీ.. నేడు అనగా ఆదివారం రోజున బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 52 మందికి దీనిలో స్థానం కల్పించింది. లిస్టులో బీసీలతో పాటు సీనియర్లకు కూడా స్థానం కల్పించారు. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.

కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు. ఇక ఈటల రాజేందర్‌.. హుజురాబాద్‌తో పాటు.. గజ్వేల్‌ నుంచి పోటీలో దిగుతున్నారు. అయితే బీజేపీ తొలి అభ్యర్థుల జాబితాకు విడుదల ముందే ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై వేసిన సస్పెన్షన్‌ని ఎత్తివేసింది. దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

అయితే రాజాసింగ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత వెనక బీజేపీ వ్యూహం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజా సింగ్‌ను ఎన్నికల బరిలో నిలిపే ఉద్దేశం ఉన్నందునే ఆయన మీద వేసిన సప్పెన్షన్‌ను ఎత్తివేశారు అనే మాట వినిప్తోంది. రాష్ట్రంలో బీజేపీకి పట్టు ఉన్న స్థానాల్లో.. గోషా మహల్‌ ఒకటి. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తరఫున రాజా సింగ్‌​ పోటీ చేసి.. విజయం సాధించారు. ఇక్కడ రాజా సింగ్‌కు మంచి పట్టు ఉంది. దాంతో మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే.. గోషామహల్‌లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుంది అని నమ్మకంతోనే.. ఎన్నికల ముందు రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తి వేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

హ్యాట్రిక్‌ కోసం..

గత రెండు ఎన్నికల్లో అనగా.. 2014 శాసనసభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన రాజా సింగ్‌.. గోషామహల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ముఖేష్ గౌడ్‌పై 46,793 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రాజా సింగ్‌. అలానే 2018లో, మరోసారి అదే నియోజకవర్గం నుండి బీఆర్‌పై అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్‌పై 17,734 తేడాతో బీజేపీ తరఫున తెలంగాణ శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు రాజా సింగ్‌.

ఈ క్రమంలోనే మరోసారి ఆయనకు గోషా మహల్‌ టికెట్‌ ఇవ్వడం కోసమే.. ఆయన మీద సస్పెన్షన్‌ ఎత్తి వేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోసారి గోషా మహల్‌లో విజయం సాధించి.. హ్యాట్రిక్‌ కొట్టాలని బీజేపీ బలంగా నిర్ణయించుకుంది. అందుకే రాజా సింగ్‌ మీద వేసిన సస్పెన్షన్‌ ఎత్తి వేసింది అంటున్నారు రాజకీయ పండితులు.

సస్పెన్షన్‌కు కారణమిదే..

గత ఏడాది ఆగస్టు మాసంలో హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ షోకి అనుమతి ఇవ్వడంతో.. రాజా సింగ్‌ మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారని రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటేసింది బీజేపీ నాయకత్వం. 2022 ఆగస్టు 23న రాజాసింగ్‌పై బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. తాజాగా ఎన్నికల ముందు.. దాన్ని ఎత్తి వేసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి